అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తేదీ 8_3_22
పేరు అద్దంకి లక్ష్మి
ఊరు ముంబై
భారతీయ వనితలు
బహుముఖ ప్రజ్ఞా వంతులు
అవని నేలే మహారాణులు
అందాలు చిందించే అభినయ శిఖామణులు
రంగా రంగాలలో విరాజిల్లిన రమణీయ మణులు
మహిళలే మహోన్నతం మహిళే మహోజ్వలం
మహిళే మహిమాన్వితం మహిళే మధురామృతం
సహనానికి భూమాత కొలువుదీరిన జగన్మాత
పారద్రోలుతుంది అసమానత
ఆమె హృదయసీమ సమతా మమతా
కత్తి పట్టి కదనరంగం లో కాలు దువ్విన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ నాగమ్మ,,,,
ఇందిరాగాంధీ సిరిమావో ప్రధానులు
ప్రతిభాపాటిల్ ప్రముఖ రాష్ట్రపతి
అంతరిక్ష యాత్ర చేసిన కల్పనా చావ్లా మేడం క్యూరీ
కర్ణాటక సంగీత సరస్వతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, సుశీల ,జానకి,
నాట్య మయూరి శోభానాయుడు
కలం పట్టి కదం తొక్కిన కవయిత్రులు మెల్ల వెంకమాంబ, రంగనాయకమ్మ,,, యద్దనపూడి సులోచన
నర్మదా బచావో నినదించే మేధాపాట్కర్
సంఘసేవా నోబుల్ శాంతి గ్రహీత మదర్ థెరిసా
క్రీడారంగం లో బంగారు పథకాలను గెలిచిన పి.టి.ఉష ,సైనా, మేరీ కోమ్ ,పీవీ సింధు,,
కవికోకిల గా ప్రఖ్యాతిగాంచిన సరోజినీ నాయుడు
అనేక మంది భారతీయ వనితలు
భారత మాతకు ముద్దు బిడ్డలు
భారత జాతి రత్నాలు
భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలు