అక్షరాల గగనంలో....-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

అక్షరాల గగనంలో....-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

---------------------------
అక్షరాల గగనంలో....
----------------------------
అక్షరాల గగనంలో
నక్షత్రాలవుదాం
అక్షయ పాత్రలవుదాం
కక్షలూ మానేద్దాం
       రక్షకులూ అవుదాం
      దీక్షబూని సాగుదాం
      పక్షి లాగా ఎగురుదాం
      కుక్షి నిండా తిందాం
లక్షలు సంపాదిద్దాం
దక్షతనే పొందుదాం
లక్ష్యాన్ని కల్గియుందాం
లక్షణంగా బ్రతుకుదాం
      పక్షపాతం లేకుండా
      శిక్షణ కొనసాగిద్దాం
      వీక్షిద్దాం! లోకాన్ని!!
     అక్షులను మురిపిద్దాం
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments