విద్యుల్లతగా నిలువు (కైతికాలు)

విద్యుల్లతగా నిలువు (కైతికాలు)

అండ పిండాలనుండి
అడుగడుగున గండంతో
పుట్టగానే  ఈసడింపు
ఇనామ్ గా వెలివేతతో
ఎదురు చూస్తూ అల్లుకుంది
అందమైన బోనులో

చైతన్యం నిండుగున్నను
చపలత్వపు వాక్కులకు
తను జడిసి గడపనుండు
కన్న వారి కను సైగకు,
ఎప్పుడు మారునో గానీ
అప్పుడె తను వీడు లేమి

అవసరాలలో తేడా
అంతరాల నీడాయే
ప్రతిభ యెంత యున్నను
ప్రకటించుట ముప్పాయే
సమాజంలొ సగమున్న
భయమీడి బ్రతుకు సున్నాయే

వక్రబుద్ధులను వరించి
స్వార్థ పరుల నీడన
తుమ్మ ముళ్ళునళ్ళిన
తూనీగ లాగ  బతుకున
ఒదుగుతూనే యుండి
ఆకు చాటు పిందైనది

ఉత్సాహం వాటేసి
భవితవ్యం బాటపట్టు
మానవీయ లోతులను
యెంచగ తను తలపెట్టు
చుట్టు కున్న ముళ్ళు దునిమి
సువాసనల సుధలు పెంచు

అల్లుకున్న చెరలు చూడు
చీకటి నీడలను వీడు
నీకు నీవే శత్రువగు
నైజము తులనాడు
విద్వత్తు వికసింపగా
విద్యుల్లతగా నిలువు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
             రమేశ్ గోస్కుల

0/Post a Comment/Comments