సి. శేఖర్ |
వెన్నెలలా...చల్లగా
మనిషిగా మారాలంటే
సాటి మనిషిని గౌరవించు
చేసే ధర్మం ఫలించాలంటే
దీనులవైపు చూపు మళ్ళించు
దేవుని కనుగొనాలంటే
నీలోని నిన్ను నీవు దర్శించు
దైవత్వాన్ని మనసునింపుకోవాలంటే
మానవత్వాన్ని ప్రదర్శిస్తుంది
లోకాన్ని జయించాలంటే
మొదట నిన్నునీవే జయించు
సాటి మనసులో నీవుండాలంటే
సాగే పయనంలో సాటివారిపై కరుణను కురిపించు
గమనంలో గతాన్ని విడవాలంటే
వర్తమానంలో ఒక్కో అడుగు ఆలోచనతో వేసేయ్
ఆవేశానికెక్కడ తావివ్వక ఆనందాన్ని నింపేసేయ్
పరిధిని దాటి హద్దులుమీరక
అందరి మనసులు గెలిచేయ్
ఆకాశంలో చుక్కలవనంలో వెలిగే వెన్నెల వెలుగువే నీవై
---సి. శేఖర్(సీయస్సార్),
పాలమూరు,
9010480557.