మహిళా క్షేమం! ---ఇ.వి.వి.యస్. వర ప్రసాద్

మహిళా క్షేమం! ---ఇ.వి.వి.యస్. వర ప్రసాద్


**********************
 మహిళా క్షేమం!
**********************
(ప్రక్రియ : పంచపదులు)

ఆమె లేనిదే సృష్టి లేదు
ఆమె లేనిదే భుక్తి లేదు
ఆమె లేనిదే అందం లేదు
ఆమె లేనిదే బంధం లేదు
ఆమెయే.... మహిళ!


ఆమెలో అనురాగం ఉంది
ఆమెలో ఆత్మీయత ఉంది
ఆమెలో లాలిత్యం ఉంది
ఆమెలో సహనం ఉంది
ఆమెయే.... మహిళ!


ఆమెయే తల్లి అవుతోంది
ఆమెయే చెల్లి అవుతోంది
ఆమెయే భార్య అవుతోంది
ఆమెయే అత్త అవుతోంది
ఆమెయే.... మహిళ!


ఆమె చదువులలో కలదు
ఆమె ఉద్యోగాలలో కలదు
ఆమె గృహమున కలదు
ఆమె ఉద్యోగమున కలదు
ఆమెయే.... మహిళ!


ఆమె సరస్వతిగా చదువుకోవచ్చును
ఆమె మహాలక్ష్మిగా ధనమిచ్చును
ఆమె జయదుర్గగా శక్తినిచ్చును
ఆమె అన్నపూర్ణగా భుక్తినిచ్చును
ఆమెయే.... మహిళ!


ఆమెపై భ్రూణ హత్యలున్నాయి
ఆమెపై అత్యాచారాలున్నాయి
ఆమెపై గృహహింసలున్నాయి
ఆమెపై పాపిష్టి కళ్లు ఉన్నాయి
ఆమెయే.... మహిళ!


ఆమెకు రక్షణ కరువైంది
ఆమెకు గౌరవం తరిగింది
ఆమె ఉనికికి ముప్పైంది
ఆమె భవితొక ప్రశ్న
ఆమెయే.... మహిళ!


ఆమె క్షేమమే అవని క్షేమము
ఆమె క్షేమమే కుటుంబ మోదము
ఆమె క్షేమమే ప్రగతుల
తీరము ఆమె క్షేమమే శాంతికి నిలయము
ఆమెయే.... మహిళ! ప్రసాదు!


**********************
 ఈరంకి......✍️
********************** **

తేదీ: 08-03-2022 మహిళా దినోత్సవం సందర్భంగా

ఇ.వి.వి.యస్. వర ప్రసాద్,
కవి, తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180

0/Post a Comment/Comments