రత్నాల సరాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

రత్నాల సరాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

రత్నాల సరాలు
---------------------------------------
కనిపించే వేల్పులు
కన్నవారు మహిలో
త్యాగానికి గురుతులు
పూజించుము మదిలో

అనుభజ్ఞులు వృద్ధులు
గౌరవించు సతతము
వారు చెప్పు మాటలు
నిజము కదా అమృతము

పసి పిల్లల నగవులు
వెన్నెలమ్మ వెలుగులు
పాల కడలి తరగలు
మల్లె పూల సొగసులు

మహనీయులు గురువులు
వారు కల్పతరువులు
జ్ఞానానికి త్రోవలు
దైవానికి రూపులు

--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments