ఇలలో నీ జన్మకు సాటి ఎవరు...? ---పెద్దమాల్ రాజ్ కుమార్

ఇలలో నీ జన్మకు సాటి ఎవరు...? ---పెద్దమాల్ రాజ్ కుమార్

ఇలలో నీ జన్మకు సాటి ఎవరు...?
పెద్దమాల్ రాజ్ కుమార్ 

ఈ యుగంలో ఉన్న 
ప్రతి సృష్టి నీ నుంచే పుట్టింది.
ఆడజన్మ అనే పదం... పక్కనపెడితే,
ఇలలో నీ జన్మకు సాటి ఎవరు...?
అందుకే ....
నీ జన్మ ఓ అద్భుతం
నీ సహనం ఓ అమోఘం
నీ బాధ్యత వర్ణణాతీతం....

బాల్యం
----------------------
చిరుప్రాయంలో అల్లారుముద్దుగా,
కాళ్ల గజ్జల నాదంతో,
తప్పటడుగులు-
గుమ్మంలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే,
ఆ ఇంటికే వన్నె తెచ్చే
నీ అందం - ఓ చందం...
మమకారంతో అందరినీ
కవ్వించి - నవ్వించే నీకు
ఈ లోకంలో సాటి ఎవరు....?
అందుకే ....
నీ జన్మ ఓ అద్భుతం
నీ సహనం ఓ అమోఘం
నీ బాధ్యత వర్ణణాతీతం....

యవ్వనంలో
-------------------------
ఈడు వచ్చిన ప్రాయంలో-
ఒక ఇంటిదాన్ని చేస్తే,
వయసు రాకముందు పుట్టింటి బాధ్యతలను-
వయస్సు వచ్చిన తరువాత మెట్టింటి బాధ్యతలను,
తనదైన శైలిలో నిర్వర్తించి-
అందరి మన్ననలు పొందే నీకు.....
ఈ లోకంలో సాటి ఎవరు....?
అందుకే ....
నీ జన్మ ఓ అద్భుతం
నీ సహనం ఓ అమోఘం
నీ బాధ్యత వర్ణణాతీతం....

మాతృమూర్తివై
-------------------------------
తప్పటడుగులు వేసేటప్పుడు,
అడుగుతప్పి బిడ్డ కిందపడితే,
అక్కున ఒళ్ళో చేర్చుకొని-
లాలించి,పాలిచ్చి,
బాధను మరిపిస్తావు.
బిడ్డలు తప్పుద్రోవ పట్టోద్దని, 
వారికి ఆట పాటలు నేర్పి,
ఆది-అంత్య గురువయ్యావు.
విద్య బుద్ధులు నేర్పి,
బిడ్డల బంగారు బాటకు పునాదులు వేస్తావు.
పిల్లలు సాధించిన
చిన్న బహుమానాన్ని-
విశ్వంతో పోల్చి ఆనంద సంబురంలో
మునిగి తేలియాడుతున్న నీకు...
ఈ లోకంలో సాటి ఎవరు...?
అందుకే ....
నీ జన్మ ఓ అద్భుతం
నీ సహనం ఓ అమోఘం
నీ బాధ్యత వర్ణణాతీతం....

వృద్ధురాలివై
-------------------------------
బిడ్డలు-అల్లుళ్ళు,
కొడుకులు-కోడళ్ళు,
మనవలు-మనవరాళ్లతో 
నవ్వుతూ.....నవ్విస్తూ...
ఇంటి గుమ్మం ముందు కూర్చొని,
బిడ్డల బతుకు మార్గం
పూలబాట వేస్తూ,
సుగమనం చేరాలని,
చివరి శ్వాస వరకు
నీవు పడే ఆరాటానికి....
ఈ లోకంలో సాటి ఎవరు....?

అందుకే ....
నీ జన్మ ఓ అద్భుతం
నీ సహనం ఓ అమోఘం
నీ బాధ్యత వర్ణణాతీతం....

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

      ---పెద్దమాల్ రాజ్ కుమార్..
      మల్దకల్, జోగులాంబ గద్వాల్.
       8790631172
 


0/Post a Comment/Comments