మహిళా దినోత్సవం సందర్భంగా...... ఔషధి నాప్కిన్ ల పంపిణీ

మహిళా దినోత్సవం సందర్భంగా...... ఔషధి నాప్కిన్ ల పంపిణీ

3.3.22
 ఔషధి నాప్కిన్ ల పంపిణీ

                  మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వనాధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, శొంఠ్యాం, విశాఖపట్నంలో శ్రీరామ హెర్బల్ ఇండస్ట్రీలో తయారైన నాప్కిన్ లను పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో క్లాస్మేట్ క్లబ్ తెలంగాణ రాష్ట్ర సాహిత్య కమిటీ ప్రతినిధి అయిన డాక్టర్.పోల.సాయి జ్యోతి అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లా వారు ఫార్మసీ విద్యార్థులకు ఉచితంగా అందజేశారు.

     ఉమెన్ హెల్త్ మరియు హైజీన్ లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో పార్ట్ టైం పరిశోధనలో భాగంగా పి.హెచ్.డి. చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవి బంకపల్లి బి. ఫార్మసీ, ఫార్మ్ .డి విద్యార్థులకు హెర్బల్ డ్రగ్ టెక్నాలజీలో భాగంగా చెత్త నుండి సంపద తయారీలో భాగంగా మహిళలకు ఉపయోగపడే ఇకోఫ్రెండ్లీ సానిటరీ నాప్కిన్ లపై అవగాహన కల్పించడమేగాక,డాక్టర్.పోల.సాయిజ్యోతి ఆర్థిక సహకారంతో ఫార్మసీ విద్యార్థినులకు అందజేశారు.

   ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఉమా దేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవి, సహా ఆచార్యులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా రమాదేవి గారు మాట్లాడుతూ క్లాస్మేట్ క్లబ్ ద్వారా డాక్టర్.పోల. సాయిజ్యోతి చేస్తున్న  పలు సేవా కార్యక్రమాలను గురించి తెలిపారు. ఈ సందర్భంగా సాయిజ్యోతికి ధన్యవాదములు  తెలిపారు.

0/Post a Comment/Comments