కవి
కనిపించేవి
వినిపించేవే కాదు
కనిపించని వినిపించని
వాటిని తన హృదయం తో చూడగలడు
ఒక లక్ష్యం కోసం కలం
తో సమాజ క్షేత్రం లో
ప్రజా పక్షమే అతని నైజాం
భయం లేదు భావన తప్ప
అక్షరాలు పిరంగులుగా
అక్రమాల పై పేల్చగలడు
హృదయ తన్మయత్వం లో
తనకు తానే సాటి
అచ్చు అయిన కవిత చూసి
జీవితం లో ఏదో పొందిన అనుభూతి
ఎండల్లో వాన
వానలో ఎండ
ఎడారి లో మంచు
గుండెలను పిండి చేయగలడు
హాస్యం తో అయుష్షు పోయాగలడు
దేశ నిర్మాణం లో అయిన పునాదీ
సృజనలో మేటి
మాటలో వాగ్ధాటి
ఆయన కులం అక్షారం
ఆయన ప్రాణం మానవత్వం
సమసమాజమే హితం
కొందరి దృష్టి లో అది పిచ్చి
కానీ అతనికి అంతరనుభూతి
కవి కలం తో వికాసం కోసం
ఆరాట పడే హృది
వి.శేషారావు
లింగాపూర్,కామారెడ్డి
9440408080
Post a Comment