యు"క్రై" ---డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్.

యు"క్రై" ---డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్.

యు"క్రై"
---డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,సికింద్రాబాద్.
**********************

భాషలేదు కన్నీటికి
విధ్వంసానికి,
మారణహోమానికి సజలమై,
గాయాల జ్ఞాపకాలు,
అనుభవాల మరకలు,
కళ్ళముందు కూలుతున్న ఆశల సౌధాలు,
బాంబుల మోతలతో,
రాకెట్ లాంఛర్ల ఛేధనలతో,
గగనమొక భీకరమై కన్పిస్తుంటే,
పసిపిల్లల ప్రాణాలు పోతుంటే,
యుద్ధట్యాంకుల నడకల మధ్య నలుగుతున్న బతుకులు.
రేపటి సూర్యోదయం అరుణమయమై దర్శనమిస్తుంటే,
దేశాధినేతల ఎత్తులపైకెత్తుల్లో
ప్రజలు చిత్తవుతున్నారు.
విధ్వంసం మిగిల్చిన శకలాల మధ్య,
గతాల ఆనవాళ్ళు స్పష్టమవుతుంటే,
వలసపోతున్న జీవితాలు,
శరణార్థులై ప్రాణాలరచేతుల్లో పట్టుకొని,
వీడ్కోలు తీసుకుంటున్నారు.
సరిహద్దులు దాటి,
తమవారినొదిలి,
యుద్ధక్రీడలో కేవలం
ప్రేక్షకులై నిలుచున్నారు.

0/Post a Comment/Comments