జల జాతర

జల జాతర

మరుమల్లియ లాంటి మనసున్న మేఘుడు
మట్టి పరిమళాలు పూయించ
తొలకరి చిరుచినుకుల్లా
జాలువారే జలపాతంలా
అమృతధారలనే కురిపించగా..
తడిసి ముద్దైన ముదితగా సిగ్గులమొగ్గై
పరవసించి పసిడి పంటలనే
పండించును భూమాత..
తన నడకతో నవ జీవనానికి నాందియై
నాగరికతకే పోటీ నేర్పిన నవనీతమా..
ఆయువునిచ్చి జీవాధారమై
ప్రకృతి పదనిసలతో
చిగురులనే మొలిపించిన సోయగమా..
పువ్వులందు నవ్వులనే పూయించి
పుడమినందు వెలుగుతున్న మధుర బిందువుగా..
వాగులు వంకలుగా..
 ఉప్పొంగే కడలిగా...
అలలై కదిలే కనువిందులుగా
రాళ్ళను సైతం కరిగించే  చెలిమికై
ప్రణమిల్లే జగమంతా నీ చెంతనే.....
వసుధ మెడలో ముత్యమల్లే మెరిసి
సిరుల వన్నెలద్దుకున్న చైతన్య ప్రవాహినితో
సంజీవనిలా నీవడుగిడిన చోటే జల జాతర.....

 శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments