డబ్బుకు లోకం దాసోహం ---ఎన్. రాజేష్

డబ్బుకు లోకం దాసోహం ---ఎన్. రాజేష్

డబ్బుకు లోకం దాసోహం
డబ్బు అంటేనే విలువ
నీ దగ్గర డబ్బు ఉంటేనే విలువ.. 
నీకు అంటూ ఏడుంది విలువ 
ఆ డబ్బు ఉంటేనే నీకు ఇస్తారు విలువ.!

నేటికాలంలో డబ్బు లేకుంటేనే జబ్బు 
ఆ డబ్బు నీ దగ్గర లేకుంటే నువ్వె ఒక  గబ్బు.!

పుట్టినప్పటి నుండి చచ్చేవరకు 
అన్నింటా డబ్బుమయం లో.. 
డబ్బు లేకుంటే జరగవు 
పుట్టుక-గిట్టుక అనేవి నేటి కాల గమనం లో.!

జానెడు పొట్ట కూటికై బ్రతుకు పోరాటంలో 
డబ్బు సంపాదనకై వేట..
అది లేకుంటే సాగదు ఈ బ్రతుకు చిత్రం లో ఏ ఆట.!

పూట గడవాలని పేదవాడు 
రోజు గడవాలని మధ్య తరగతి వాడు 
తరతరాలకోసమని ధనవంతుడు 
ఎవడైనా బ్రతికేది డబ్బు కోసమే కదా.. 
ఆ డబ్బే లేకుంటే బ్రతుకు పోరు సాగదు కదా..? 

ప్రస్తుత జీవన విధానంలో డబ్బు ఉంటేనే తృప్తి..
అది లేకుంటే ఎలా ఉంటుంది  సంతృప్తి?

డబ్బు ఉంటేనే పారుతుంది పాచిక 
అది లేకుంటే ఎలా సాగుతుంది నీ నడక-నడవడిక?

అందుకే పైసాకే పరమాత్మ అనేది నేటి తరం సూక్తి..!
డబ్బుకు లోకం దాసోహం అనేది 
ఈ తరం జీవితానికి ముక్తి..!!

.....ఎన్. రాజేష్ - హైదరాబాద్
(కవి, రచయిత, జర్నలిస్ట్)

0/Post a Comment/Comments