క్షయవ్యాధి-అవగాహన(కైతికాలు)

క్షయవ్యాధి-అవగాహన(కైతికాలు)

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా...

తరచుగా దగ్గడం
క్షయవ్యాధి కావచ్చు
ముందు జాగ్రత్తతో
టీ బి ని అరికట్టవచ్చు
క్షయవ్యాధిని అరికడదాం
జాగ్రత్తలు పాటిద్దాం.

పోపుతొ వచ్చే దగ్గని
నిర్లక్ష్యం తగదు
జాగ్రత్తలు లేకున్నా
నిర్మూలనే కాదు
అశ్రద్ధతో తప్పు
క్షయవ్యాధి ముప్పు.

సిగరెట్ బీడివల్ల
దగ్గుదమ్ము చేరును
నిర్లక్ష్యం వహిస్తే
క్షయవ్యాధిగ మారును
ధూమపానం వద్దు
టీ బి  గురికావద్దు.

దుమ్ముధూళివల్లకూడ
దగ్గుదమ్ము రావచ్చు
ఊపిరితిత్తులో చేరి
క్షయవ్యాధిగ మారచ్చు
జాగ్రత్తలు పాటించండి
వ్యాధిని అధిగమించండి.


తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.

0/Post a Comment/Comments