కొప్పుల ప్రసాద్

కొప్పుల ప్రసాద్

నలంద మరియు విజ్ఞాన్ డిగ్రీ కళాశాలల 5వ వార్షికోత్సవం...

శనివారం నాడు డి. వై. ఆర్. ఫంక్షన్ హాల్లో నంద్యాల పట్టణం లో వెలసిన నలంద మహిళా డిగ్రీ కళాశాల & విజ్ఞాన్ డిగ్రీ కళాశాల 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో కళాశాలల డైరెక్టర్లు
ఉమామహేశ్వర రెడ్డి గారు , రామ్మోహన్ రెడ్డి గారు, ఏ .బి. ఎల్. రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ,మహేశ్వర్ రెడ్డి గారు ,పాల్గొనడం జరిగింది. డైరెక్టర్స్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో స్థాపించిన అనతికాలంలోనే కళాశాలలు గొప్ప విజయాలు సాధించాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఇప్పుడు 900 మంది విద్యార్థులు తమ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు అని పేర్కొన్నారు.. అది తమ కళాశాలలు సాధించిన ఘన విజయం గా చెప్పారు. అంతేకాకుండా చక్కని ప్రణాళిక, అనుభవజ్ఞులైన లెక్చరర్స్, నిరంతర పర్యవేక్షణ, చక్కటి హాస్టల్ వసతి, మరియు అనేక ఐ.టి. కంపెనీలు , బ్యాంకింగ్ వారిని పిలిపించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ,చక్కని ప్రణాళికతో వారికి శిక్షణ ఇచ్చి, ప్లేస్మెంట్స్ లో జాబులు కల్పించడం జరుగుతుందని చెప్పారు. రాయలసీమ యూనివర్సిటీ 
పరీక్షల్లో తమ విద్యార్థులు ప్రతి సెమిస్టర్లో ను ఉత్తమ ప్రతిభ చూపిస్తున్నారని విద్యార్థులను మెచ్చుకున్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అనంతరం విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ దేవదాసు
మరియు కళాశాల లెక్చరర్స్ బృందము మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

0/Post a Comment/Comments