అనుభవం సూక్తులు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అనుభవం సూక్తులు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అనుభవం సూక్తులు
-------₹₹₹₹-------------
1). మనసు  మనసులో లేనప్పుడు
    మనం  మనసు ఉన్న వాళ్లను
మన మనసులో తలచుకుంటే
మనకు మనశ్శాంతి కలుగుతుంది!

2). గుండెలు పిండేసే బాధ కలిగినప్పుడు
మన కన్నుల నిండా నీరు వస్తోంది
ఆనందం పరవళ్ళు తొక్కినప్పుడు
కూడా కన్నుల నిండా నీరు వస్తుంది

3). కష్టకాలమందు ఆదుకున్న వారిని జీవితాంతం మరువలేం
వారి సాంగత్యమే మనకు బలం
అని నమ్ముతాం మనం కలకాలం!

4). దృఢ సంకల్పమే  కార్యసాధనకు మార్గం
చిత్త ధ్యానం మనం చేస్తే
దైవానుగ్రహం ఇక మస్తే !

5). పరోపకారం చేస్తే పుణ్యం
     పరపీడన చేస్తే పాపం
ఏది కావాలో నీవే ఎంచుకో
ఎంచుకొని పలితం పంచుకో !

6) మనస్ఫూర్తిగా నువ్వు నవ్వాలంటే మందు నీ బాధ తో నువ్వు  ఆడుకోగలగాలి బతుకు పాట పాడుకో గలగాలి!

7). మర్యాదగా వినడం నేర్చుకో
వివేకంతో సమాధానం ఇవ్వడం
ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అత్యవసరం అని గ్రహించు!

8). జీవిత పరుగు పందెంలో  క్రింద పడ్డానని ఆగి పోవద్దు
భవిత కై తిరిగి ప్రయత్నిస్తే నీకు విజయం కలుగుట కద్దు!

9) నిర్మలమైన మనసు దర్పణం లాంటిది
అందులో మన మంచిచెడ్డలు ప్రతిబింబిస్తాయి!
ఆలోచించి అడుగేయండి ముందు
అప్పుడౌతుంది నీ జీవితం పసందు 

10). ద్వేషమును త్యజించు 
        శాంతంతో జీవించు
        మంచితనం పెంచుకో
       దేవుడవని పించుకో !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments