చందమామ పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

చందమామ పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

చందమామ పిల్లలం (బాల గేయం)
--------------&&&&&&&---------------
చందమామ పిల్లలం
కుందనాల బొమ్మలం
వెన్నెలమ్మ జల్లులం
 పూలకొమ్మ మల్లెలం !
    
            పల్లె తల్లి వాడలో
             చల్లనైయ్య నీడలో
              పెరిగినం తిరిగినం
              ఆటలాడ మరిగినం !

 వేకువజామున లేస్తాం
సోకుగ స్నానం చేస్తాం
చేస్తాం మా దైవ స్మరణం
చదివేస్తాం మేం అమరం !

       మేం పుట్టినట్టి పల్లె రేవళ్ళి
        మా చిట్టిపొట్టి చెల్లి శ్రీవళ్ళి  
        మే మిద్దరం కవల పిల్లలం 
         ముద్దమందారం మల్లెలం  !

సరస్వతి మాతకు మొక్కినం
శిశుమందిరంలో మేం చిక్కినం
అక్షరాల గుడిమెట్లను ఎక్కినం
అక్షర లక్షలు అందులో చెక్కినం !

ఉన్నత చదువులు  చదివాం మహోన్నతులై ఇలలో ఎదిగాం
అందరితో కలిసే ఉంటున్నాం
ఐకమత్యం మాబలమంటున్నాం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెం.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments