తెలుగుజాతి పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

తెలుగుజాతి పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

తెలుగుజాతి పిల్లలం(బాల గేయం)
-----------&&&&&&--------------------
తెలుగు జాతి పిల్లలం
వెలుగు ఖ్యాతి మల్లెలం
అచ్చ తెలుగు వారలం
మెచ్చుకున్న పోరలం !

మా మాతృభాష తెలుగు
మా నాలుకపైన వెలుగు
మామాట ఎంతో మధురం
పలుకుతుంది మా అధరం !

మా ఊరిలో ఉంది మాకు ఓ బడి
అక్షర లక్షలు నేర్పుతుంది ఆగుడి అందులో చదువుతాము నిత్యం
పొందుగా ఎదుగు తాము సత్యం !

మా తెలుగు సభలను జరిపిస్తాం
వెలుగు ప్రభలతో మేం మురిపిస్తాం
తెలుగు వెలుగు వానల కురిపిస్తాం
పలు అక్షరలక్షల వీణల సవరిస్తాం!

తెలుగు జాతి వాణిని చాటుతాం
వెలుగు ఖ్యాతి వీణను మీటుతాం
తెలుగు జాతి పిల్లలం మేమందరం
వెలుగునీతి మల్లెలతోనే సుందరం!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments