స్త్రీ- పురుష - భేదం.(చిట్టి కథ). బాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

స్త్రీ- పురుష - భేదం.(చిట్టి కథ). బాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

స్త్రీ పురుష భేదం (చిట్టి కథ)
-----------&&&&&&-------------
ఓసారి బీర్బల్ దర్బారుకు ఆలస్యంగా వస్తేతే అక్బర్ చక్రవర్తి
"బీర్బల్  దర్బారుకు ఆలస్యం ఎందుకయింది? అని ప్రశ్నించాడు.
దానికి బీర్బల్"జహాపనా! ఈ రోజు మా ఇంట్లోలో తులసి మాత పూజ వుంది. ఆ మాత కు పూజ చేసుకుని రావడంతో ఆలస్యం అయ్యింది"అన్నాడు. దానికి అక్బర్ గారు"ఏమి తులసి మొక్క మీకు తల్లి యా? ఆమెకు ఓ పూజ నా? చూడు అని ఓ తులసి మొక్కను చెప్పించి ముక్కలు ముక్కలుగా తుంచి వేసాడు."చూశావా బీర్బల్! మీ తల్లిని ముక్కలు చేసిన ఏమీ అనలేదు. తననేం చేసిన ఏమి అనని ఈ మొక్క మీరు పూజిస్తే మీ కోరికలు తీరుతుందా. నీ పిచ్చి గాని. అని నవ్వాడు అక్బర్. అప్పటికి మౌనం దాల్చాడు బీర్బల్. మరునాడు యథాప్రకారంగా ఆలస్యంగానే వచ్చాడు బీర్బల్."మళ్లీ ఈ రోజు ఏ పూజ చేస్తే ఆలస్యం అయ్యింది"అని ప్రశ్నించాడు అక్బర్ చక్రవర్తి.
           అవును ప్రభూ! నిన్న మా తల్లి పూజ జరిగితే ఈరోజు మా తండ్రి పూజ జరుపుకున్నాము. అందుకే ఆలస్యం."మీ తండ్రి కూడా ఒక మొక్కే నా? అదేమి మొక్క .
"ప్రభూ! మీకు ఇబ్బంది కాకుండా మా తండ్రి మొక్కను వెంట తెచ్చాను. చూడండి అని తండ్రి మొక్క,ను చూపించాడు. తీగవలె ఉన్న ఆ మొక్కనుచూసి నవ్వుతూ
"ఓహో! ఇదా మీ తండ్రి. ఇప్పుడు నీ తండ్రి ముక్కను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తా, అని ఆ మొక్కను రెండు చేతులతో మొక్కలు ముక్కలుగా చేసి చేతులు దులుపు కున్నాడు రాజు.
        కొద్దిసేపటికి అక్బర్ చక్రవర్తి చేతులకు దురద మొదలైంది. గోక్కోవడం మొదలుపెట్టాడు. ఎంతకీ దూల తగ్గలేదు. ఏమి బీర్బల్"ఈ మొక్కను ముక్కలు చేస్తే దురద మొదలైంది ఈ దురద ను భరించలేకపోతున్నాను. అని అని అరిచాడు రాజు.
        రాజా!"మహాతల్లి శాంతమూర్తి. అందుకే ఆమెను నలిపేసిన మిమ్మల్ని ఏమీ అనలేదు. కానీ  మా తండ్రి మహా కోపిష్టి. మీరు నలిపేసి నందుకు వారు ఆగ్రహించి ఈ దురద కలిగించారు. అనగా"అది సరే నైయ్యా! ఈ దురద తగ్గే మార్గం చెప్పవయ్యా అనగా"చూడు ప్రభూ! మా అమ్మ  శాంతమూర్తి! మా అమ్మ  మొక్కకు మీరు మొక్కితే మిమ్మల్ని క్షమించి  మీ దురదను మా తల్లి తప్పిస్తుంది అన్నాడు బీర్బల్. వెంటనే తులసి మొక్కను తప్పించి ఆకుల రసం తీసి రాజు చేతులకు దురద ఉన్న చోటల్లా పూయించాడు బీర్బల్. దురద మంట వెంటనే తగ్గిపోయింది. అప్పుడు అక్బర్ చక్రవర్తి సిగ్గుపడి బీర్బల్ నోటితో చెప్పక చేసి చూపించాడని అర్థం చేసుకున్నాడు చక్రవర్తి. కావున తులసి తల్లి వంటిది. దూలగొండి తీగ తండ్రి వంటిది అన్నారు పెద్దలు.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments