పరిశుభ్రత పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పరిశుభ్రత పిల్లలం. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

పరిశుభ్రత పిల్లలం (బాల గేయం)
-----------&&&&&&&&--------------
మేం పరిశుభ్రత పిల్లలం
మా పరిశ్రమల మల్లెలం
పారిశుద్ధ్య చికిత్స చేస్తాం
కోరి అశుధ్ధిని తొలగిస్తాం !

పరిసరాలను పరిశీలిస్తాం
పారిశుద్ధ్యంను ప్రారంభిస్తాం
అశుధ్ధిని అంతట తొలగిస్తాం
పరిశుభ్రత క్రాంతిని కలిగిస్తాం !

మెరుగ్గా పారిశుధ్యం చేస్తాం
సరిగ్గా పరిశుభ్రతను చూస్తాం
చెత్త సమస్యను చేస్తాం దూరం
వ్యర్థాలతొలగింపు కాదు భారం !

సర్కారు ఆస్పత్రులను గమనిస్తాం
ఎర్కచేసి వారిని మేం హెచ్చరిస్తాం
తలవంచి ముందే చేస్తాం మేం పని
అంతాచూసి ముందుకు రావలని. !

ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుతాం
జంతుప్రాణుల సంచారం తొలగిస్తం
మానవ  సంచారమును వెలిగిస్తాం
పరిశుభ్రతతో అందరిని మెప్పిస్తాం !

సర్కారు ఆస్పత్రుల్లో సమస్యలను
ప్రభుత్వం దృష్టికి మేం తీసుకెళ్దాం
నిరంతరం వాటిపై దృష్టి పెడతాం
యువతరంతో శుభ్రత చేపడతాం !

గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments