ఆడపిల్లలం.(బాల గేయం)
------------&&&&&-------------
ఆడపిల్లలం మేము ఆడపిల్లలం
ఈడ పిల్లలం కాము ఈడ పిల్లలం
ఇంటి లోపలున్న తోడు మల్లెలం
కంటి బొమ్మలున్న ఈడు మొల్లలం
చదువులు చెప్పించునులే నాన్న
అదుపులో ఉంచి మెప్పించు అమ్మ
అన్నదమ్ములు ఉంటారులే తోడు
ఉన్నదమ్ములతో మేం ప్రతి యేడు!
వంటా-వార్పు నేర్పుతుందిలేఅమ్మ
ఇంటా బయట తర్ఫీదుఇచ్చునాన్న
వారి ఆధ్వర్యంలో ఎదుగుతాంమేం
కోరి ప్రాపంచిక జ్ఞానం పొందుతాం !
కుట్లు అల్లికలను నేర్పిస్తుంది అమ్మ
అల్లిబిల్లి ఆటలాడించే పూలకొమ్మ
బొట్టు బోనం గూర్చి చెప్పేస్తుంది
కట్టుబాట్ల ముడిని తావిప్పేస్తుంది !
ఆడపిల్ల అని వారు అనుకోలేదు
ఈడపిల్ల అనే వారు అనుకున్నారు
మాబంగరు భవిష్యత్ కోరుకున్నరు
అంగరంగ వైభవంగ పెంచుకున్నరు
అమ్మ నాన్న అంటే మాకెంతో ప్రేమ
వారికై పడుతాం మేం ఎంతో శ్రమ
ఆడపిల్లలమైనా అపర కాళికలం
ఈడపిల్లలమైనామేం ఏలే ఏలికలం
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.