ముచ్చట్లు . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ముచ్చట్లు . (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ముచ్చట్లు (బాల గేయం)
----------&&&&&-----------
ముచ్చట్లు ముచ్చట్లు
ముద్దొచ్చే  ముచ్చట్లు
అచ్చట్లు ముచ్చట్లు
అలరించు అచ్చట్లు!

అచ్చట్లు ఈ ముచ్చట్లు
కొట్టించునులే చప్పట్లు
వీనులకిచ్చును విందు
వనితలకే అవి పసందు!

ముచ్చట్లు అచ్చట్లు
మురిపాల ముచ్చట్లు
కసరుకోని ఈఅచ్చట్లు
కొసరి కున్న ముచ్చట్లు!

ముచ్చట్లు చప్పట్లు
ముచ్చటైన ముచ్చట్లు
కొట్టించును తప్పెట్లు
ముట్టించును రాకెట్లు!

ముచ్చట్లు ముచ్చట్లు
మామూవీ ముచ్చట్లు
యాసయైన అచ్చట్లు
మూసయైన ముచ్చట్లు!

అచ్చట్లు మాముచ్చట్లు
పొద్దు పుచ్చుముచ్చట్లు
అందమైన ఈముచ్చట్లు
చందమామ ముచ్చట్లు!

ముచ్చట్లు ముచ్చట్లు
వంటావార్పు అచట్లు
ఇంటా జంట ముచ్చట్లు
కంటా కొంటె చప్పట్లు. !

ఆట పాట ముచ్చట్లు
మీఠా చోటా అచ్చట్లు
వాటా కోటా ముచ్చట్లు
పోటా పోటీ అచ్చట్లు  !

సరసాల ముచ్చట్లు
విరహాల  అచ్చట్లు
కలహాల ముచ్చట్లు
వరహాల  చప్పట్లు !

బతుకమ్మ ముచ్చట్లు
మెతుకమ్మ  అచ్చట్లు
ఒట్టేస్తున్న ముచ్చట్లు
కొట్టేస్తున్న చప్పట్లు !

ముచ్చట్లు ముచ్చట్లు
తంబాకు ముచ్చట్లు
తాంబూలం అచ్చట్లు
తంబోలా ముచ్చట్లు !

ముచ్చట్లు ముచ్చట్లు
నగ-నట్ర ముచ్చట్లు
సిగ పట్ల అగచాట్లు
పగపోట్ల చప్పట్లు లు !

ముచ్చట్లు ముచ్చట్లు
ముగ్గుల ముచ్చట్లు
సిగ్గులతో తెరచాట్లు
విగ్గులతో పొరపాట్లు!

ముచ్చట్లు ఈ ముచ్చట్లు
మా మగువల ముచ్చట్లు
వారి విడువని ముచ్చట్లు
మరి ఒడువని  అచ్చట్లు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments