అనుభవం సూక్తులు
--------&&&&&----------
11) మానవ మేధస్సు
విజ్ఞానం హవిస్సు
మాధవ మనస్సు
దానవ ధనస్సు. !
12). సేవలు చేసే చేతుల
బాసలు చేసే మూతుల
అదుపులో ఉంటే మంచి
కుదుపులే ఉండవు ఎంచ!
13). పెరిగేను కాలుష్య పిండం
కలిగించే వాయుగండం
అండపిండ ఈ బ్రహ్మాండం
అదిరి చెడె ఆరోగ్యభాండం !
14) మేధస్సుకు సానపెట్టు
ఆవిష్కరణల చేపట్టు
ప్రతిజ్ఞతో పంతం పట్టు
ప్రతిభను ఇక నిలబెట్టు !
15). కలుషితమవుతుంది ఈ గాలి
తెలుసుకొని మనం మెలగాలి
పడేవు ఆ కాలుష్యం కంపల
చెడి ఉండలేవు ఆ కొంపల !
16) ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు
వాడి నీవు ఇక చెడొద్దు
పెడిచెవిన ఇక పెట్టొద్దు
పట్టం దానికి కట్టొద్దు. !
17) నీకు ఉండాలి ఇక ఓర్పు
నీటికి నడకలు నీవు నేర్పు
తప్పక వచ్చునులే మార్పు
అది పంటల ఆర్తిని తీర్చు
18). నీటిని పొదుపు చెయ్యి
అదుపులో సేద్యం చెయ్యి
జలవనరులను పెంచెయ్యి
అలశిరులను పంచెయ్యి !
19). స్వచ్ఛ ఆరోగ్యం నీవు కోరు
నీ శిరోభారం వెంటనె తీరు
ఆరోగ్య సంస్థ మాట విను
ఆ మహా భాగ్యాన్ని కను !
20). వ్యర్ధాలు కలిగించు ముప్పు
విడమర్చి అందరికీ చెప్పు
గ్రామాల్లో కొట్టించు డప్పు
సంగ్రామంచే తప్పు ముప్ప !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.