ప్రవచనాల ప్రవాహం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రవచనాల ప్రవాహం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రవచనాల ప్రవాహం
--------&&&&&----------
ఏకేక శుష్క వృక్షేన
దహ్యమానేన వహ్నినా
దహ్యతే తధ్ధనం సర్వం
కుపుత్రేణ కులం యథ  !

భావం
----------
దట్టమైన అడవిలో ఒక చెట్టు ఎండిపోయినది. దానికి అగ్ని తగిలినది. ఆ చెట్టు అంటుక పోవడమే కాక, మహా అడవినంతా
కాల్చి వేయను. అట్లే వంశములో దుర్జనుడు ఒక్కడు కొడుకుగా పుట్టినచో ఆ వంశము అంతటినీ నాశనము చేయును.

2). అస్తీతి పూజ యామీశం
     నాస్తీతి వక్తి నిందకః
     నాస్తి చే న్నాస్తి మే బాధా
    ఆస్తి చే న్నా స్తికో హతహః !

భావం
-----------
ఈశ్వరుడు ఉన్నాడని నేను పూజ చేస్తున్నా. లేనే లేడని చెప్పుచున్నారు దేవనిందకులు(నాస్తికులు). ఒకవేళ అ దేవుడు లేకపోతే నాకు వచ్చే బాధ ఏమీ లేదు. కానీ దేవుడుంటే మాత్రం పోయేది నాస్తికుడే.

3). తపసా విద్యయా బుధ్ధ్యా
మంత్రౌ ష‌ధి రసాయనైః
అతియాతి పరం మృత్యుం
న కశ్చిదపి పండితః !

భావం
----------
ఎంత తపస్సు చేసినను, విద్య ఎంత కలిగినను, బుద్ధి విశేషముగా నున్ననూ, మంత్రోపాసన చేత ఏయోషధి చేతను,ఏ రసాయనము లతోనూ అవి మృత్యువును దాటించ జాలవు. అక్కడ ఎవడునూ పండితుడు కాడు. ఈ విధముగా ఎన్ని ఉపాయముల ద్వారాగాని మృత్యువును తప్పించ జాలవు. మృత్యువును మించినది లేదని భావం.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments