ఆట పాటల పిల్లలం.(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

ఆట పాటల పిల్లలం.(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

ఆట పాటల పిల్లలం (బాల గేయం)
-------------₹₹₹₹₹₹₹-------------------
విచ్చుకున్న పసిమొగ్గలం
మెచ్చుకున్న రసిసిగ్గులం
మేం ఆటపాటల పిల్లలం
మామాట ఊటలమల్లెలం!

 నవ్వులనే రువ్వుతాం నిత్యం
 పవ్వుల్లా నవ్వుతాం సత్యం
 మేం అందరిని అలరిస్తాం
ముందుగా నమస్కరిస్తాం!

చదరంగం ఆటంటే మాకు ఇష్టం
పదబంధం మాటంటే మాకు కష్టం
అయినా మేం ప్రయత్నిస్తుంటాం
ఏమైనా  విజయం సాధిస్తుంటాం !

మా ఊరి బడిలోనే చదివాం
మేం పోరు చేసి బాగా ఎదిగాం
ఊరోల్లతో కలసిమెలసి పాడాం
కుర్రాళ్ళతో అలసిసొలసి ఆడాం!

మంచి వారితోనే మా సోపతి
చెడ్డవారితో కలుగు అధోగతి
ఈమాట చెప్పిందే మాగురువు
ఆయనే మాజీవన కల్పతరువు !

అప్పుడప్పుడు గుడికి పోతుంటాం
ఆ దైవ ప్రార్థన గూడా  చేస్తుంటాం
మానవసేవయే మాధవ సేవ యని
మా మనసులో మేం భావిస్తుంటాం 

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
ఫోన్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments