ప్రవచనాల ప్రవాహం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రవచనాల ప్రవాహం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రవచనాల ప్రవాహం!
-------&&&&&----------
4). నా కవిత్వ మధర్మాయ వ్యాధయే దండనాయవా
కు కవిత్వం పునస్సాక్షా స్మృతి రాహు ర్మనీషిణః

భావం
----------
నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్ను ఎవరు దండంచరు. తిట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నీవు తప్పకుండా నీ పాఠకులను చంపిన హంతకుడు అవుతావని పండితులు చెప్పియున్నారు

5). ఏ తప్పు చేయని వాడు ఎవరికి భయపడడు. ఎల్లప్పుడు సత్యము చెప్పు వారికీ ఆటంకాలు కలుగుట సహజం. కానీ  వాటిని జయించి వారు విజయ్ కిరీటాన్ని ధరిస్తారు.

6). మానవునికి అన్నింటికన్నా  గొప్ప వరం ఏమిటంటే.
సంతోషముగా ఉండగలగడమే!.

7). సత్యము భగవంతుడి కన్నా గొప్పది.
సత్యమేక పదం బ్రహ్మః
సత్యే ధర్మః ప్రతిష్టతి
సత్యమేవాక్షాయ వేదాంత
సత్యేనైవాష్యతే పరం!

భావం
----------
సత్యమే బ్రహ్మ. ధర్మము సత్యము నందే సు ప్రతిష్ఠితమై ఉంటుంది. సర్వ వేద స్వరూపమే సత్యము. సత్యము చేతనే మోక్షం లభించును.

8). ఆధ్యాత్మికత పేరుతో ప్రపంచాన్ని గమనించకపోతే ప్రమాదమే. గమనించిన ప్రపంచమే సర్వం అనుకుంటే ఆధ్యాత్మికత అవసరమే ఉండదు.

9) ఏవని మీద ద్వేషమూ
ధనవంతుని చేయదు.
కోపం ఉంటే గుణవంతుడు కూడా డా చెడి పోతాడు.
మంచితనం మనిషిని దేవుడిగా చేస్తుంది.

10). చేస్తూ పోతే
ఎంత పెద్ద పని అయినా మిగలదు.
వ్రాస్తూ పోతే
మహా గ్రంథమైనా ముగియక పోదు.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments