తెలుగు సంత్సరాల వెనుక ఉన్న కథ
తెలుగు సంత్సరాల వెనుక ఒక కథ ఉంది నారద మహాముని ఓ సా రి విష్ణుమాయవల్ల స్త్రీ గా మారి ఓ రాజును పెళ్లాడుతాడు వారికి 60 మంది సంతానం జన్మిస్తారు ఓ సారి రాజు తన మొత్తం పిల్లలతో యుద్ధం కు వెల్లుతాడు ఆ యుద్ధం లో 60 మంది పిల్లలు చని పోతారు.అప్పుడు నారదుడు విష్ణువును ప్రార్ధిస్తాడు,విష్ణువు కరుణించి కాలచక్రం లో నీ పిల్లలు తిరుగుతుంటారు అని వరం ఇవ్వడం వల్ల 60 సంత్సరాల కాలంలో తిరుగుతూ ఉండడం వాళ్ళ తెలుగు లో ఆ పేర్లు స్థిరపడ్డాయి అని ప్రతీతి
ఆధ్యాత్మిక కథనం
సౌరమానం లో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి తిరుగుతే 360 డిగ్రీలు పూర్తి అవుతుంది కేంద్రం నుంచి గమనిస్తే ముందు 180 డిగ్రీలు వెనుక 180 డిగ్రీలు అన్నమాట,వెనుక ఉన్న గతం 180 డిగ్రీలు గతం నిలబడిన రేఖ వర్తమానం ముందు ఉన్నది.
భవిష్యత్తు సూచకాలు కృత,త్రేతా,ద్వాపర యుగాల కంటే మానవ ఆయురార్ధం పడి పోయి కేవలం 120 సంత్సరాకు వచ్చింది ఆట అందుకే 60 ఏళ్ళు పూర్తి అవగానే సగం జీవితం పూర్తి అయిపోయినట్లుగా భావించి తరువాత కాలం మార్గదర్శనం చేస్తూ మోక్ష మార్గం,ఆధ్యాత్మిక చింతన లో బతుకాలని చెప్తారు ఈ అరవై సంవత్సరాలు వలయంలో వారు పుట్టిన సంత్సరం నుంచి 60 పూర్తి కావడాన్ని వలయా సంపూర్తిగా తెలుస్తుంది