శీర్షిక: ఆదర్శనీయుడు. పేరు: బి.యమున

శీర్షిక: ఆదర్శనీయుడు. పేరు: బి.యమున

అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసం
------------------------------------------

శీర్షిక: 
ఆదర్శనీయుడు అంబేద్కర్

భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్.
చిన్నతనంలోనే ఎన్నో ఆటంకాలు అవమానాలను, అవహేళనలను ఎదుర్కొని
ఎంతో నిబ్బరంగా మంచి చదువులతో తన జీవితాన్ని
మలచుకోవడం ఆయనలోని కృషి, పట్టుదల, ఆచరణ , క్రమశిక్షణ, అకుంటితదీక్ష అన్ని కలగలసిన గొప్ప వ్యక్తి డా.బి.ఆర్. అంబేద్కర్.

భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14న "మౌ" అన్న ఊరిలో రాంజీ మలోజి సాక్వాల్, భీమబాయ్ దంపతులకు 14వ చివరి సంతానంగా జన్మించాడు.  ఇతని అసలు పేరు భీమరావు రాంజీ అంబానడేకర్.
బాల్యంలో మెహర్లను అస్పృష్యులుగా పరిగణించడ వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో మాట్లాడకుండా, కలవకుండా, పాఠశాలలో గదిలో ఓ మూలన కూర్చోబెట్టేవారు. భారతదేశంలో ఆనాటి సమాజంలో తనపై ద్వేషం, పగ, అవమానం మరియు నిందలు ఉన్నప్పటికీ అతను ఉత్తమ విద్యను పొందాడు. ఈ కారణంగా ఆతను రాజ్యాంగాన్ని సృష్టించాడు.
అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ సైన్యంలో సైనికుడిగా పనిచేసేవారు. ఉన్నతపాఠశాలలో ఉత్తీర్ణత సాధించిన తరువాత 16 సంవత్సరాల వయసున్న రమాబాయిని వివాహం చేసుకున్నాడు.

విద్యాభ్యాసం:
--------------------
1900 సంవత్సరంలో అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలలో చేరినది మొదలు మెట్రిక్యులేషన్ అత్యధిక మార్కులతో పాసయ్యాడు. బి.ఏ. ఉత్తీర్ణులైన తరువాత ఉన్నతవిద్యకోసం విదేశాలకు వెళ్ళారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆప్ బిజినెస్ తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యనభ్యసించారు అంబేద్కర్. ఎం.ఏ. పీహెచ్ డీ తో పాటు, న్యాయశాస్త్రంలో పీహెచ్ డీ పూర్తిచేశారు. విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు.

*తన జనంకోసం*:
--------------------------
తన వర్గంలోని ప్రజలకోసం చదువు చెప్పించి బాగా చదవాలని ప్రోత్సహించాడు.
"బహిష్కృత హితకారిణి" అనే  సంస్థను స్థాపించారు. అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేశారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహరాష్ట్ర గుజరాత్ నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహత్ చెరువులోని నీటిని త్రాగడానికి వారికి అనుమతి లేకుండేది. అంబేడ్కర్ ఆ చెరువులోని నీరు త్రాగారు. చరిత్రలో అదో సంచలనం.

దేశ నిర్మణంలో:
---------------------
1931లో రౌండ్ టేబుల్ సన్నాహాల సందర్భంగా అంబేడ్కర్ గాంధీజీని కలిశారు. తర్వాత స్వాతంత్య్రమొచ్చాక భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు.

అదేవిధంగా తరతరాలుగా బడుగు బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్ వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను తీవ్రమైన నేరంగా చేశారు. 
అంబేద్కర్ పార్లమెంట్ సభ్యుడుగా ఎంపికైన తర్వాత
వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన 
హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను పార్లమెంట్ లో నిలిపివేయడంతో 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 
తర్వాత తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను తన ఆత్మకథ "వెయిటింగ్ ఫర్ ఏ విసా"లో రాసుకున్నారు. అంబేద్కర్ తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6 న కన్నుమూశారు.

బి. యమున,
9వ, తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అమడబాకుల,
వనపర్తి జిల్లా.
7569976369.

0/Post a Comment/Comments