శీర్షిక: ఆశయసాధకుడు. పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: ఆశయసాధకుడు. పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: ఆశయసాధకుడు

అతడు అణగారిన జాతినంత
మెల్కొల్పేందుకు ఉదయించిన చైతన్యగీతిక
మనిషిని సాటిమనిషి గౌరవించని బతుకులలో
చీకటిని పారద్రోలేందుకు 
ఉదయించిన చైతన్యసూర్యుడు
పుట్టిన పుడమిలోనే బానిసలై బతుకీడుస్తూ ఊరవతలికిసిరికొట్టినపుడు
అవమానభారన్నంతా ఒంటినిండా పులుముతున్న సమాజంలో
అంటరానితనం వెంటాడుతున్న తరుణంలో
చాదస్తపు సమాజాన్ని పావనం చేసేందుకు
కంకణం కట్టుకుని పట్టువిడవని మొండిగుండెధైర్యాన్ని అణువణువునా నింపుకుని నవోదయమై కదిలాడు
మాటలలో చేతలలో 
అవమానాన్ని బహుమానమిచ్చే కులపిచ్చిగాళ్ళ గజ్జిని కడిగేందుకు కదిలాడు 
తాడితపీడిత జనాలకోసం జనించిన భగవంతుని 
మరో ఆవతారమే అంబేద్కర్
పసితనంలోనే అవమానాలనెన్నో గుండెనింపుకుని
వెనకడుగేయకనే అనుకున్న ఆశయసాధనవైపే పయనం
మనిషిలో గూడుకట్టుకున్న 
భయానక రాక్షసత్వపు జవసత్వాలను కూకటివేళ్ళతో పెకిలించేందుకై
విధినిసైతం ఎదిరించిన వీరయేదుడు అంబేద్కర్
తనదేశంలోనే అంటరానితనంతో ఒంటరైన మనుషులలో శక్తిని నింపేందుకు యుక్తితో కదిలిన మానవత్వ తత్వవేత్తాయన
బహుజనుల దీనస్థితికి
వెనకబాటుతనానికి అక్షరజ్ఞానం లేకపోవడమని విడమరచి చెప్పిన మహోన్నతుడాయన  
ఆడవాళ్లందరనాడు 
చాదస్తపు ఆచారపలవాట్ల
కంబంధహస్తాల్లో 
వంటింటికుందేళ్లై బతుకీడుస్తున్నడు 
ఆడవాళ్లకు సైతం అన్నింట్లో అవకాశాలనివ్వాలని వెలుగెత్తిచాటి
ఈనాటి వాళ్ళ ఉన్నతస్థితికి
గట్టిపునాదులేసిన సంఘసంస్కర్త అంబేడ్కర్
నాటి సమాజంలో చదువుకోవడమంటే సప్తసముద్రాలీదడంలాంటిదే
అందుకేనేమో
పట్టుబట్టి ప్రపంచజ్ఞానాన్నంతా
తనల జ్ఞాననేత్రంతో చూడగలిగినాడు
ఆయనో జ్ఞానపిపాసి
అందుకే
ఎవరు అందుకోలేని
జ్ఞానశిఖరాలనందుకొని
ప్రపంచమేధావయ్యాడు
అఖండభారతావని
అల్లకల్లోలంగా చల్లాచెదురైనపుడు
బానిస సంకెళ్ళతో బాదించబడుతున్నపుడు
ఏకత్వంకోసం అడుగేసిన ధైర్యశాలి
సాధించుకున్న స్వాతంత్ర్యం
సాగాలంటే ముందుకు
అవకాశాలందరందుకోవాలి
భారతమాత బిడ్డలందరికి
మార్గం చూపే చుక్కానై
బిన్నజాతులంతా జేజేలనంగా
తన మేధాసంపత్తితో
మహామహులందరితో కలిసి
మహత్తరమైన రాజ్యాంగాన్ని
ప్రసాదించిన సమసమాజమూర్తి మహర్షి
దేశమంటే ప్రజలేనని
ప్రజలందరికీ విలువపెంచేలా
వజ్రాయుధమంటి ఓటుహక్కునిచ్చిన మహనీయుడు
భవిష్యత్తు దార్శనికుడు
ఆయన ఆశయం హిమాలయశిఖరం
ప్రజలందరూ బాద్యతతో వ్యవహరించాలి
ఆయన కలలుగన్న బహుజనరాజ్యం స్థాపించాలి

(అంబేద్కర్ జయంతి సందర్భంగా)

సి.శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments