హనుమ జయంతోత్సవం

హనుమ జయంతోత్సవం

*🌹. శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత / How and When to Celebrate Hanuman Jayanti 🌹*
*🍀. శ్రీ హనుమాన్‌ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు అందరికి Happy Hanuman Jayanthi (Hanuman Vijayothsav) to All 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.*

*పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు... అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు...*
 
*చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు, ఈ దీక్ష చివరి రోజున  హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు...*

*వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.*

*''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.*

*🍀. హిందూమతంలో ప్రాముఖ్యత : 🍀*

*హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*

*హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.*

*🍀. హనుమంతుని నైజం 🍀*

*యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్*
*బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్*

*శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.*

*కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.*

*హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 23 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 How and When to Celebrate Hanuman Jayanti 🌹*
*🍀 Happy Hanuman Jayanthi to All 🍀*
*📚 Prasad Bharadwaj*

*Lord Hanuman, a dedicated disciple of the Hindu Lord Rama, is worshipped all over the India by the Hindu people for his deep devotion to the god Rama. People worship Lord Hanuman as a symbol of devotion, magical powers, strength and energy. People read Hanuman Chalisa as it has ability to conquer the evil spirits and provide peace to the mind. The devotees of Lord Hanuman visit Hanuman temples at this day after a holy in the early morning, apply red tilak (vermillion) to the foreheads of Hanuman idol, read Hanuman Chalisa, offer Prasad of laddoo, do Aarti by chanting mantras and Aarti songs, make round of the temple and so many rituals. As Lord Hanuman was born to the Vanara community having reddish orange color body, that's why it is seen to all the Hanuman temples having reddish orange colored Hanuman idol. After puja, people apply red Sindur to their own foreheads as a Prasad and distribute laddoo Prasad among people to get blessed with what they have prayed to their God Hanuman.*

*In the Maharashtra, it is commemorated to the Purnima in the Hindu Lunar month of Chaitra. However, according to other Hindu calendar, it falls on 14th day (chaturdashi) of Ashvin month in the dark fortnight. After puja, Prasad is distributed among people to have full blessings.*

*In Tamil Nadu and Kerala, it is celebrated in Margazhi month (between December and January) in the belief that Lord Hanuman was born to the amavasya in the Margazhi month. In Odisha, it is celebrated on 1st day in the month of Baisakha (in April). In Karnataka and Andhra Pradesh, it is celebrated on 10th day of Vaishaka month in the Krishna Paksha. It is the 41 days long celebration in the Andhra Pradesh which starts from the Chaitra Purnima and ends at 10th days of the Krishna Paksha of Vaishakha month.*

*🍀 Significance of Hanuman Jayanti Celebration 🍀*

*Hanuman Jayanti celebration indicates the balanced coexistence of the whole human fraternity with the nature's incredible creature, Lord Hanuman from Vanara community. People from the Hindu religion worship Lord Hanuman as a divine creature. This celebration has lots of importance to all however Brahmacharis, wrestlers and bodybuilders are specially inclined towards this celebration. There are many names through which Lord Hanuman is famous among his devotees like Bajrangabali, Pavanasuta, Pavankumar, Mahavira, Balibima, Marutsuta, Anjanisut, Sankat Mochan, Anjaneya, Maruti, Rudra and many more.*

*Hanuman avatar is considered as the 11th Rudra avatar of the Lord Siva with great devotion, strength, knowledge, divine power, bravery, intelligence, spirit for selfless service and etc. He has devoted his life only for his Lord Rama and Mata Sita and never shows his bravery and intelligence without any purpose. The devotees of the Lord Hanuman always pray him for getting blessed with the same for their bright future. He is worshipped in many ways by his devotees; some meditates by repeating his name many times to get power, fame, success and etc in the life whereas some reads the Hanuman Chalisa to get the same.*

*It is considered that Lord Shiva had to rebirth as a human being on the earth in his 11th Rudra avatar in the form of Hanuman as He could not serve to the Lord Rama by being in His real form.*

*The whole Vanara community including all the human fraternity was happy and celebrated his birthday with great enthusiasm and joy by dancing, singing and lots of activities. From then, it was started celebrating as a Hanuman Jayanti by his devotees to get strength and wisdom like him.*

*🍀 Hanuman Mantra: 🍀*

*Manojavam Maruttulyavegm*
*Jitendrium Buddhimatam Varishtham*
*Vatatmajam Vanarayuthmukhyam*
*Shri Ramdutam Sharanam Prapdye.
   UMASESHARAO VAIDYA
    LINGAPUR

0/Post a Comment/Comments