శీర్షిక: రైతుపై రాజకీయమా. పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: రైతుపై రాజకీయమా. పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: రైతుపై రాజకీయమా?

ఈనాడందరూ రైతురాగమెత్తుకుంటున్నరు
అధికార అందలాలు చేజారకుండ
వడ్లు కొనేందుకు దుడ్లులేవని
రైతు స్వేదాన్ని కడుపారా నింపుకొని
ఉద్దరిస్తామని ఉద్దెరమాటలతో కాలయాపన
ధర్నాలతో మాటలపోటీలు
పైనోడిమీద కిందోడు
కిందోడిపైన పైనోడు
బురదజల్లుకుంటూ కుళ్ళురాజకీయాల్జేస్తున్నరు
వడ్ల పేరుజెప్పి ఓట్లు కొన్నట్లున్నది బేరం
మెత్తనికుర్సిల కూసోని
చల్లని గదులల్లా అలవాటవడ్డోళ్ళు
చెమటసుక్కల సేద్యానికి
చిందించే స్వేదానికి విలువతగ్గచ్చి విర్రవీగుతుండ్రు
ఉడుకుడుకు వండిపెట్టినామే
కాదిక్కడ ముఖ్యం
ఊదుకు తిను అన్నమె గొప్పదైనట్టుంది అడ్డగోలు వరిరాజకీయం
కష్టానికంతా నష్టంజేసేటోల్లే
పాలకులారా జనంకోసం కదలండి
శాశ్వతంకాదు మీరనుభవించే అధికారం
దిక్కార గళాలన్నేకమై తూర్పారబట్టేందుకు సిద్దమైతున్నయ్
గమనిస్తున్నది కుతంత్రాలన్నీ
మాయమాటల కోటలనన్నీ
కూకటివేళ్ళతో పెకిలించేందుకు
ప్రజలు వెర్రోలనుకుంటున్నరా
కర్రు కాల్చుతున్నరు
కీలెరిగి వాతెట్టుందుకు
తస్మాత్ జాగ్రత్త!!

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు

0/Post a Comment/Comments