పుస్తకం -డా.అడిగొప్పుల సదయ్య

పుస్తకం -డా.అడిగొప్పుల సదయ్య

ఆ.వె.
నలువరాణి రూపు-నజ్ఞానమును బాపు
చేతి యందు భూష చెడుగు నాపు
సాధు గోవు చేపు- సకలవిద్యల కాపు
అఖిల విషయ చయపు టలవి తెలుపు

సీ.ప.
నీవద్దనది యున్న నిక్షేపసిరులుండు
తరముల బంచిన తరిగిపోవు

నీవద్దనది యున్న నెలకొను మన్నన
గారవింతురు చేరి కరములెత్తి

నీవద్దనది యున్న నిలుచు మాటలబోటి
జిహ్వ యందున చేరి చిరము వరకు

నీవద్దనది యున్న నిఖిల విద్యలసార
మెల్లయెల్లలు లేక వెల్లివిరియు

ఆ.వె.
తెలివినిచ్చు నదియు,తెగువనిచ్చునదియు
తెరువునిచ్చునదియు,పరువునిచ్చు
కటిక యిరులయందు కరదీపికైవచ్చు
పుస్తకంబు పెంచు మస్తకంబు

అర్ధాలు:
నలువ = బ్రహ్మ
చయము =సంగ్రహము
అలవి = సారము
చేపు = స్రవించు పాలధార
మన్నన = గౌరవము
మాటలబోటి = సరస్వతీదేవి
చిరము=బహుకాలం
ఇరులు = చీకట్లు

కవనశ్రీ చక్రవర్తి
డా.అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట, కరీంనగర్
9963991125


0/Post a Comment/Comments