రంజాన్ మాసం

రంజాన్ మాసం

పవిత్ర రంజాన్ మాస0 విశిష్టత లు


ఎవరు తమ ప్రభువు 'అల్లాహ్'
 వాక్యాలు విశ్వసిస్తారో....

 ఎవరు తాము ఇవ్వగలిగిన గుప్తదానాలు' జకాత్' చేస్తుంటారో....

 ఎవరు తమ హృదయములో ప్రభువుకు' గౌరవం '...' భక్తి' తో సుస్థిర స్థానం కల్పిస్తారో....

 ఎవరు మంచి వైపుకు పరుగులు తీస్తారో..వారు దైవ కృప మెండుగా పొందుతారు.

 ఎవరైతే వేకువ కు  ముందే నిద్రలేచి ఆహారం తయారు చేసుకొని సూర్యోదయానికి ముందే కుటుంబంతో కలిసి భోజనం 'సహార్' పూర్తి చేస్తారో....

 ఎవరైతే సూర్యాస్తమయం వరకు 'ఉపవాస దీక్ష 'చేస్తారో....

 ఎవరైతే 'అరిషడ్వర్గాల'నుఅధిగమిస్తూ...' 'పంచేంద్రియా'లను అదుపు చేసి, నూతన జీవితాన్ని అవలంబిస్తారో...

 ఎవరైతే' ఉపవాస దీక్ష' విరమించి ఇరుగుపొరుగు వారితో ': ఇఫ్తార్' విందు ఆరగిస్తారో.....

 ఎవరైతే కఠిన క్రమశిక్షణకు అలవాటు పడతారో...

 ఎవరైతే ఆకలి, దాహం లకు అతీతులై, నిగ్రహశక్తి పెంచుకుంటారో..

 వారికి...

 'సామరస్యం' ': సహకారo' 'క్రమశిక్షణ'కు ఆవకాశం కల్పిస్తుందీ  పవిత్ర '' రంజాన్' మాసం .వారందరికీ అల్లాహ్ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.
ఆప్తులు అయిన ముస్లిం సోదరి సోదరులకు
ఖురాన్ దివ్యాసందేశం,అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు అడ్వాన్సుగా ఇధముభారక్
   ఉమశేషారావు వైద్య
   లెక్చరర్ ఇన్ సివిక్స్

0/Post a Comment/Comments