జలామృతం(కైతికాలు)తాళ్ల సత్యనారాయణ

జలామృతం(కైతికాలు)తాళ్ల సత్యనారాయణ

ఆరోగ్యాన్నిచ్చే
అమృతమంటి నీరు
కలుషితం చేయకండి
నిర్లక్ష్యంతో మీరు
విశేష గుణాలున్నవి
ప్రాణధారమైనవి

ఆహారం తయారు
చేసుకోవడానికి
తిన్నది తేలికగా
జీర్ణమవడానికి
నీరే ముఖ్యము
సకలజీవరాశికి

శరీరాన్ని ఆరోగ్యంగా
ఉంచుతుంది నీరు
అలసటలో చైతన్యం
తెస్తుంది మంచినీరు
రక్షించుకుంటే భవిష్యత్తు
లేదంటే కష్టం యావత్తు

అమూల్యమైన నీటిని
వృధా కానివ్వద్దు
అమృతమంటి నీటిని
కలుషితం చేయవద్దు
పొదుపుచేద్దాం నీటిని
రాబోయే తరాలకు

సకల జీవరాశికి
ప్రాణాధారమైనది
నీరే ఆరోగ్యమిచ్చి
పరిశుభ్రతనిచ్చేది
ప్రతినిత్యం వాడేది
పొదుపుచేస్తే మేలు

అంతర్గతంగా ఉన్న
మలీనాలు తొలగించు
బాహ్యంగాను నీరు
పరిశుభ్రత కలిగించు
భవిష్యత్తు మేలెంచు
నీటిని రక్షించు.

తాళ్ల సత్యనారాయణ.

0/Post a Comment/Comments