శీర్షిక: మారని తలరాతలు. పేరు: సి. శేఖర్

శీర్షిక: మారని తలరాతలు. పేరు: సి. శేఖర్

శీర్షిక: మారని తలరాతలు

నాలుకను మా బాగా వాడుకునేవాళ్ళు నాయకులు
ఎంతమాటొస్తే అంత మాటిచ్చేసి అధికారాన్నెగిరేసుకుపోతరు
మడమతిప్పనోళ్ళే వాళ్ళంతా
జనం గొర్రెలని తెలిసినోళ్ళు
మందులముంచి మాయజేసే బూటకపురాయుళ్ళు
దోచుకుని శిక్షపడ్డ జాలిపడి అందలమెక్కిస్తరు
పాతబుద్ది తిరిగిజూయిస్తరు
ఊసరవెల్లి బుద్ది ఉంపుడుగత్తెలసోకు 
గోడమీదిపిల్లులు 
అధికారమెవ్వరికుంటే వాళ్ళపంచనజేరుతరు
ఐదేళ్ల కాలంజాలు ఐనకాడికి ఎనుకేసుకుంటరు
జనం తాయిళాలిస్తేజాలు
దొంగచేతికి తాళలిచ్చేస్తరు
రాజకీయ చదరంగంలో
రాజులు వాళ్ళు
వారసత్వ రాజకీయాలిక్కడ రాజ్యమేలుతుంటయ్
పిరయింపుజేసి అరాంగుంటరు
ఇందుగలడందులేరను సందేహంబు లేనేలేదు
విలువలులేని నయవంచకులు
అన్ని సద్దిమొహాలేనాయే
కండువాలు మార్సుకుంట
దోపిడికి దారులెతుకుతరు
ప్రజాస్వామ్య దేశంలో శిక్షలసులుండవాయే
ఏలుతున్న నాయకులేమో 
కోర్టులసుట్టు తిరుగుతుంటరు
ఇదే ఇక్కడి న్యాయం మరి
ఉచితపథకాల ఊహల లోకంలో తెలియాడుతూ ఓటర్లు
బతుకెంత దిగజారిన కారణాలెతకని మహనీయులు
ధరలెంత పెరిగిన ఉపాసముంటరా 
అప్పుల ఊబిల ఇరుక్కుపోయి తలెత్తకుండా తగలడిపోతరు
తరాలెన్నిమారినా
తలరాతమారనోళ్ళు
ఏదేమైనా వంశపారంపర్యం రాజ్యాధికారమిక్కడ

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments