రంజాన్ నేల ప్రాముఖ్యత

రంజాన్ నేల ప్రాముఖ్యత



*నెలవంక*: ప్రపంచంలోని ప్రతి మతంలో ప్రతి జాతిలో ప్రతి తెగలో  పండుగలు జరుగుతూ ఉంటాయి అవన్నీ సూర్యమాన కాల ప్రకారంగా  జరుగుతాయి ఏదైనా చారిత్రాత్మక మైన ఆధారంగా గాని లేదా పెద్దలు నిర్ణయించిన సంవత్సరంలో నెలలో లేదా  ఏదైనా సంఘటనను అనుసరించి గాని  లేదా ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి పేరు మీద గాని పండుగలు జరుగుతూ ఉంటాయి అయితే ముస్లింలు జరుపుకునే పండుగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి ఉదాహరణకు రమజాన్ పండుగను తీసుకున్నట్లయితే ఇది చంద్రమాన కాల ప్రకారం గా జరుపుకోబడుతుంది ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా రమజాన్ 9వ నెల ఈ నెలలో ఉదయించే నెలవంకను చూడగానే ఒకటవ తేదీ మొదలవుతుంది  పాత కాలంలో నెలవంకను చూసినప్పుడు మబ్బు గాని దుమ్ము ధూళి గానీ ఉన్నట్లయితే భయభక్తులు గల సత్య వంతుడైన ఒక వ్యక్తి సాక్ష్యం బలమైన సాక్ష్యం గా పరిగణింపబడేది వారు ఆడ అయినా సరే మగ అయినా సరే స్వేచ్ఛ పొందిన బానిస అయినా సరే అదేవిధంగా పాపాత్ముడు అని తేలని వ్యక్తి అతడు బాహ్యంలో చూస్తే దైవభీతి గలవానిగా కనిపిస్తే అతని సాక్ష్యం కూడా  బలమైన సాక్ష్యంగా పరిగణింపబడేది అయితే వారు దైవభీతిపరులై దైవభక్తి పరులై ఉండాలనేది షరతు కానీ ఈనాడు వచ్చిన సాంకేతిక విప్లవం వల్ల మబ్బుల్లో దాగి ఉన్న నెలవంకను సైతం బైనాక్యులర్ ద్వారా చూసి ప్రకటిస్తున్నారు ఇక్కడ మరో విషయం చెప్పాలి హిలాల్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది హిలాల్  అంటే నెలవంక ఈ కమిటీ ప్రతినెల నెలవంకను చూసి తేదీని ప్రకటిస్తుంది ఆ ప్రకటన పత్రికలలో కూడా వస్తుంది ఆ ప్రకారంగా రాబోయే నెల ఇరవై తొమ్మిది రోజులా లేక 30 రోజులా అనేది తెలిసిపోతుంది నెలవంక కనబడగానే మస్జిద్ లలో siren మోగిస్తారు 

*ప్రార్థనలు ప్రారంభం*

ఇక ఈ రోజు నుండి  మామూలుగా చేసే నమాజు తర్వాత గంటసేపు అదనంగా నమాజు నెరవేర్చాల్సి ఉంటుంది అంటే దివ్య ఖుర్ఆన్  కంఠస్థం చేసిన వ్యక్తి దివ్య ఖుర్ ఆన్ లోని ముప్పై కాండాల నుండి ప్రతిరోజు ఒక కాండం అదనంగా చేసే నమాజులో పఠిస్తూ నమాజు చేయిస్తాడు ఇలా 29 లేక 30 రోజులు చేసే నమాజును తరావీహ్ నమాజ్ అంటారు

*రమజాన్ నెల ప్రాముఖ్యం*

రమజాన్ నెలకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే ఈ నెలలోనే దివ్య ఖుర్ ఆన్ అవతరణ ప్రారంభమైంది ఇది చివరి గ్రంథం కనుక మానవులందరి కోసం పంపించ బడింది గనుక దీనికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది 
అల్లాహ్ అంటున్నాడు:
పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల మానవులందరికీ (ఈ గ్రంథం) మార్గదర్శకం రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి కనుక ఇకనుండి రమజాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణం లో ఉన్నవారు  ఈ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తి చేయాలి 
*ఉపవాస ప్రారంభ, విరమణ సమయాలు అల్లాహ్ యే నిర్ణయించాడు*
 ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటం అయ్యేవరకు మీరు తినండి తాగండి ఆ తర్వాత వీటన్నింటిని త్యజించి చీకటి పడే వరకు మీ ఉపవాసం పూర్తి చేయండి (దివ్య ఖుర్ఆన్:2:187)
ఈ ఉపవాసం ఇప్పటి ముస్లిములే ఉంటున్నారా అని ప్రశ్నిస్తే దివ్య ఖుర్ ఆన్ ఇలా సమాధానం ఇస్తుంది: ముస్లిములరా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయింపబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్త లను అనుసరించిన వారికి కూడా విధించబడిందో  దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.... ఉపవాసం ఉండే శక్తిగలవారు ఉపవాసం ఉండకపోతే వ్యాధిగ్రస్తులు ఉండకపోతే ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవాడికి భోజనంపెట్టడం
(దివ్య ఖుర్ ఆన్: 2:183-184)

*తెలుసుకోవలసిన విషయాలు*
*(1)* ఉపవాసం ఉండడం వల్ల భయభక్తులు జనిస్తాయి అల్లాహ్ చూస్తున్నాడు అనే భయంతో భక్తుడు నోటిలో ఏ పదార్థాన్ని గాని ఈ పానీయాన్ని గాని గొంతు లోకి దిగనివ్వడు

*(2)* ఉపవాసాలు ఉండాలని ఆదేశించింది అల్లాహ్ నే

*(3)* ఉపవాస ప్రారంభ విరమణ సమయాలు నిర్ణయించింది అల్లాహ్ నే

*(4)* శక్తి కలిగి ఉన్నప్పటికీ లేక వ్యాధిగ్రస్తుడైన ప్పటికీ ఉపవాసం ఉండకపోతే ఒక ఉపవాసానికి రెండు పూటల భోజనం బీదవారికి పెట్టడం

*(5)* ప్రయాణంలో ఉంటే శక్తిగలవారు ఉపవాసం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ఉండని వారు ఆఉపవాసాన్ని వేరే దినాలలో పూర్తి చేయాలి
    భగవంతుణ్ణి చేరడానికి వివిధ మార్గాలు అల్లాహ్ సూచించిన మార్గం అనుసరణీయం
ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక రంజాన్ ఉపవాస దీక్షలు అనుసరిస్తున్న మీకు శుభాకాంక్షలు
ఉమశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments