ఉగాది కవిత

ఉగాది కవిత

  భవిష్యత్తు లో కి ఆశగా
వేదన మిగిల్చిన
వికారి 
ప్లవన0 తో ఒడ్డు ఎక్కిన
ప్రపంచం యుద్ధాభయం తో
నెట్టబడి ధరల పెరుగుదల తో
దారిద్య్రం కాకవికాలం అవుతున్న వేళా
పచ్చని మామి0డ్ల నుంచి
కు కూ అంటూ స్వరం తో
హృదయాన్ని మీటుతుంది
 ఆకురాలిన చోటే చిగురిస్తుంది
ఎండ వేడిమి రేపటి వర్షానికి
రూపం అయ్యి వసంతోత్సవాలు
వీరభుస్తూ
ప్రకృతి రమణీయత
ప్రతి ఇంటా పచ్చని తోరణాలు
అటు పక్క వేప కొమ్మలు
చలువ చేస్తూ,క్రిమి కీటకాలు
రాకుండ తోడ్పాటు
షడ్రుచులు కలబోత
జీవిత చక్రం లో మానవ నైజాన్ని అవగతం చేసే తెలుగు
వారి 
పంచాంగ శ్రవణం
కవి సమ్మేళనలు
ఎడ్ల బండ్ల  ప్రదర్శనలు
ఊరు అంత సంబరాలు
ప్రకృతి పండుగ
శుభకృత్ కావాలి
విజయానికి అభయం
భయం లేని విశ్వమానవ
కల్యాణ0
ఉమశేషారావు వైద్య
జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments