ముత్యాల హారాలు-గద్వాల సోమన్న

ముత్యాల హారాలు-గద్వాల సోమన్న

ముత్యాల హారాలు
-------------------------------------
1
త్వరగా నిదుర లేచెదము
పండ్లు బాగా  తోమెదము
ముఖము మంచిగ కడిగెదము
శుచిగ స్నానము చేసెదము
2
క్రొత్త బట్టలు తొడిగెదము
భగవంతుని వేడెదము
వేళకు బడికి పోయెదము
కాలము విలువ తెలిపెదము
3
గురువు గారికి మ్రొక్కెదము
దేవునిగా తలచెదము
నిండు మదితో కొలుచెదము
చెప్పిన రీతి నడిచెదము
4
నమస్కారము చేసెదము
సంస్కారము చూపెదము
నీతి విలువలు నేర్చెదము
దేశభక్తిని నేర్పెదము
5
ఆటలెన్నో ఆడెదము
పాటలెన్నో పాడెదము
కలసిమెలసి బ్రతికెదము
చెలిమి కలిమి పెంచెదము
6
అల్లరిపనులు వీడెదము
అందరి మేలు కోరెదము
ఐకమత్యము చాటెదము
అనురాగము పంచెదము
7
ఉన్నత విద్య చదివెదము
ఉన్నతంగా ఎదిగెదము
కన్నవారిని చూచెదము
అక్కరలన్ని తీర్చెదము
8
దేశకీర్తిని నిలిపెదము
దేశము కొరకు నిలిచెదము
స్వార్ధగుణములు వదిలెదము
సమైక్యంగా కదిలెదము
9
గొప్ప స్ఫూర్తిని పొందెదము
మంచి వైపుకు మళ్లెదము
భారతమ్మకు చెందెదము
పౌరుషంగా ఉండెదము
10
పెద్దల మాటలు వినెదము
శ్రద్ధగా పాటించెదము
చెడ్డ తలపులు తరిమెదము
దొడ్డ పనులు పూనెదము

--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments