"బాలమిత్ర పురస్కారం" గద్వాల సోమన్న కు ప్రదానం

"బాలమిత్ర పురస్కారం" గద్వాల సోమన్న కు ప్రదానం

"బాలమిత్ర పురస్కారం" గద్వాల సోమన్న కు ప్రదానం
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'బాలమిత్ర పురస్కారం' వరించింది.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొన్న వీరి ఖాతాలో మరో  అవార్డు జమ కావడం విశేషం.అచిర కాలంలోనే దాదాపు 20 పైగా పుస్తకాలు వ్రాసి,ముద్రించి తన ప్రతిభను చాటుకున్నారు.గణితో పాధ్యాయుడైనా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో  గద్వాల సోమన్న విశేష కృషి చేసినందులకు గాను వీరి ప్రతిభను గుర్తించి "ప్రఖ్య చిల్డ్రన్స్ అర్ట్స్ థియేటర్"' తెనాలి వారు "బాలమిత్ర పురస్కారం" అందజేశారు.వాట్సప్ వేదికగా సంస్థ అధ్యక్షులు శ్రీ ఆరాధ్యుల కన్నా ,ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి లక్ష్మణ్ శాస్ర్తీ, గౌరవ సభ్యులు శ్రీ లక్కరాజు లక్ష్మణ్ రావు మరియు పి. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మెమోంటో,దుశ్శాలువా,నగదు అందుకున్నారు.పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను  ప్రఖ్య చిల్డ్రన్స్ అర్ట్స్ థియేటర్ కార్యవర్గం,తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments