రాముడు-రామాయణం
-------------------------------------
జగదభిరాముడు
రఘుకుల సోముడు
సకల గుణాభి రాముడు
ఆ శ్రీరామ చంద్రుడు
పితృ వాక్య పాలకుడు
సోదరులకు ఆదర్శవంతుడు
జానకి తోడ సీతారాముడు
హనుమభక్తికి రామాంజనేయుడు
కోరిన కోరికలు తీర్చే
కోదండ రాముడు
రామనామ స్మరణతోనే
అభయమిచ్చే రఘు రాముడు..!
రమ్యమైన రామ నామం
అంతర్ముఖ శుద్ధికి నిర్వచనం
ఆధ్యాత్మిక రామ గాథ
ధర్మ నిరతికి మూలం
రాముడు చూపిన ధర్మ
మార్గం ఆదర్శ ప్రాయం..!
రామ భక్తి తోడుండ కలుగు
పుణ్య ఫలం
రామాయణం చదివిన
తొలుగు సర్వ పాపం...!
ఎదురులేనిది రామ బాణం..
తిరుగులేనిది రామ నామం..
విని తరించాలి రామ కథా సారం.!
చదివి తరించాలి శ్రీ రామ రామాయణం..!!
ఎన్. రాజేష్-ఎమ్మెస్సి
(కవి,రచయిత,జర్నలిస్ట్)
సరూర్ నగర్-హైదరాబాద్.