సమసమాజ స్వాప్నికుడు 'అంబేద్కర్'
---------------------------------------
ఉన్నత విద్యావంతుడు
అతడుకార్యసాధకుడు
అపార జ్ఞానవంతుడు
అంబేద్కరే! సైనికుడు
'అంబేద్కర్' భగీరథుడు
తెంపులో విక్రమార్కుడు
అందరికి ఆరాధకుడు
మచ్చలేని మహా రేడు
సమ సమాజ స్వాప్నికుడు
ప్రపంచ దార్శనికుడు
బడుగు జీవుల వారసుడు
భారతమ్మ తనయుడు
నిత్య పరిశోధకుడు
జ్ఞానార్జన ప్రేమికుడు
"భీంరావ్ అంబేద్కరుడు"
అసాధారణ మానవుడు
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.