పుస్తక పఠనాన్ని
అలవర్చుకోవాలి
సంపూర్ణ జ్ఞానం
పెంపొందించుకోవాలి
పుస్తకంతో నేస్తము
కలుగుతుంది జ్ఞానము
తరతరాల చరిత
తెలిపేది పుస్తకం
ఈతరాన్ని జాగృత
పరిచేది పుస్తకం
గొప్పనైంది పుస్తకము
జ్ఞానానికి రూపము
పుస్తకం చేతినున్న
ధరించినట్టు భూషణము
నిరంతరం చదివిన
కలుగుతుంది జ్ఞానము
అందమైన పుస్తకము
జ్ఞానానికి రూపము
విద్యార్థుల ఉన్నతికి
తోడ్పాటు నిస్తుంది
పై తరగతులకువెళ్లే
అర్హత కల్పిస్తుంది
అందమైన పుస్తకము
జ్ఞానానికి రూపము.
తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.