అంబేద్కర్ జయంతి కి అక్షరపుష్పాలు

అంబేద్కర్ జయంతి కి అక్షరపుష్పాలు

అంబేద్కర్ స్వీయ కష్టాలు
సామాజిక రుగ్మతల పీడనను
దూరం చేసిన సూరీడు
మనువు విషాద ఛాయలు
అల్పజనులను అంటరాని వారిగా చూస్తూ
అసమనతల పునాదుల ను
ద్వా0సం చేసి
బౌద్ధ0 తో బహు బుద్ధిమంతుడు
అపర ప్రపంచ మేధావి
సమాలోచనలు
నిరూపమానం అయిన త్యాగం నుంచి జనించిన భారత రాజ్యాంగం
సాటిలేని మేటి రాజ్యాంగం
అంబేద్కర్ స్వేదం నుండి
సేద్యం అయ్యి ఖ్యాతి నొంది
బడుగులకు రక్షణగా
శ్రేయోరాజ్య కాంక్ష కలిగి
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోది చేసి
గణతంత్ర,ప్రాజాస్వామ్య,లౌకిక
సామ్యవాద సర్వసత్తాక0 అయ్యింది
అంబేద్కర్ మల్లిపుట్టు
నీవే ఈ బూజును దహించే
అగ్నివి అయ్యి రా
కులాల కుంపటి ని పెంచే రాజకీయాలు
హత్యలు పరుపుహత్యలు
వైజ్ఞానికంగా ఎదిగిన
నేటికి అంటరానితనం
ప్రపంచికరణముసుగులో
ప్ర వేటు
అదేశిక సూత్రాలు అటకెక్కి
న్యాయమూర్థులే న్యాయాన్ని
అమ్ముకుంటే
ప్రభుత్వ గల నిర్లిప్తత
సకల సమస్యలకు అడ్డుకట్టు
ఆ మేధావి ఆలోచనలే
పరిష్కారం
కులాలు కాదు మనుష్యులు
ఒక్కటే అనే భావన పెరగాలి
  రాజ్యాంగ0 చదవండి
కులాలు. మతాలకు అతీతంగా
ప్రతి పౌరుడు రాజ్యాంగం చదివే చట్టం రావాలి
రాజ్యాంగం చదువని రాజకీయం నాయకుల్ని
వెలివేద్దాం
ఇంటింటా ఉండాలి రాజ్యాంగం
అంబేద్కర్ ఆలోచనలు
అతని మానసిక పుత్రిక
నేటికీ  ఏ నాటికైనా
పరిష్కారం
ఆయనను ఒక వర్గం పరిమితం
చేయకండి
ఆయన వాస్తవిక వాదీ
అపరమేధావి
ఆయన అడుగుజాడలే
సమసమజానికి
మానవత్వానికి ప్రతీకలు
సాంఘిక దురాచారలకు అడ్డుకట్టు
జై బీమ్ జై బీమ్
  ఉమశేషారావు వైద్య
 లెక్చరర్ ఇన్ సివిక్స్

0/Post a Comment/Comments