*స్వార్థం కొరకు..*
*కూర్చున్న కొమ్మను నరుక్కోవడం
మనిషికి వెన్నతో పెట్టిన విద్య..*
రోజురోజుకు మురికి కూపాల్లాంటి
నగరాలను పెంచుతూ..
పర్యావరణానికి రోజుకింత
పాయిజన్ ను పంచుతున్నాడు..
*ఒకప్పుడు..*
ఎటు చూసినా పచ్చని చెట్లు
పూలు పండ్లతో కళకళలాడిన ధరిత్రీ
*నేడు..*
పచ్చదనం కరువై పాపాత్ముల చేతుల్లో
బంధీగా మారడంతో
పనికిరాని వ్యర్థాలన్నీ ప్రాణం మీదకు
తెచ్చాయి...
ప్రాణవాయునిచ్చే పచ్చదనానంతా
రోజుకింత కొరుక్కు తింటూ
భూతాపం అంటున్నాడు..
*అంతేకాక..*
పంచభూతాలను చెరబట్టిన చెదలు
అంతులేని ఆధిపత్య దాహంతో..
అట్టడుగును కూడా వదలక
ఆవురావురంటూ ఆరగిస్తున్నాడు..
ప్రశ్నార్థకమైన మనుగడ
ప్రకృతి బీభత్సవానికి బెంబేలెత్తిన
అల్లాడిపోతున్న భూమాతను
ప్రతి ఒక్కరూ అక్కున చేర్చుకొని..
జీవవనాలని పెంచాలి..
ప్రకృతి విరుద్దాన్ని విడనాడి
భూతాపాన్ని తగ్గించిననాడే
అందరికీ ఆనందం..
భూమాతకు సంతోషం చల్లదనం..
శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.