పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు - 'తెలుగు ప్రథమ భాష' - 10 తరగతి

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు - 'తెలుగు ప్రథమ భాష' - 10 తరగతి

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు
'తెలుగు ప్రథమ భాష' - 10 తరగతి

మార్గదర్శకాలు

2022 కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా.......


పరీక్ష సమయం: 3గం.15ని. (195ని.)

ప్రశ్నాపత్రం చదవడానికి 15ని.

పరీక్ష రాయడానికి 180ని.


మొత్తం మార్కులు: 80

పార్ట్ - A 60మార్కులు

పార్ట్ - B 20మార్కులు


అ) పార్ట్ - 'A' - పదవ తరగతి తెలుగు (ప్రథమ భాష)లో మొత్తం పన్నెండు పాఠాలున్నాయి. వీటిలో 4. కొత్తబాట, 5. నగరగీతం, 11. భిక్ష అనే మూడు పాఠ్యాంశాలను పబ్లిక్ పరీక్షల నుండి మినహాయించారు. కాబట్టి ఈ పాఠ్యాంశాల నుండి పార్ట్ -'A'లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వగూడదు. మిగతా పాఠ్యాంశాలు. రామాయణం ఉపవాచకం నుండి మాత్రమే పార్ట్ -'A’ ప్రశ్నలను రూపొందించాలి. అలానే పార్ట్-'B' లోని పదజాలం ప్రశ్నలకు కూడా ఈ పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి.

ఆ) పార్ట్-'B' లోని వ్యాకరణాంశాల ప్రశ్నలకు మాత్రము అన్ని పాఠాలలోని వ్యాకరణాంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇ) మొత్తం 80 మార్కుల కోసం ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి.


సామర్థ్యాల వారీగా భారత్వం ప్రశ్నలు, మార్కులు


అవగాహన-ప్రతిస్పందన - 20 మార్కులు 

(పరిచిత గద్యం, పద్యం, అపరిచిత గద్యం)

స్వీయ రచన - 33 మార్కులు

3×4=12 (లఘుసమాధాన ప్రశ్నలు) 

3×7=21 (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

సృజనాత్మకత - 7 మార్కులు

1×7=7 మార్కులు

పదజాలం - 10 మార్కులు

వ్యాకరణాంశాలు - 10 మార్కులు


సామర్థ్యాల వారీగా ప్రశ్నలు, మార్కుల వివరాలు :


I. అవగాహన - ప్రతిస్పందన - 20 మార్కులు

1. పరిచిత గద్యం - 5 మార్కులు (5X1=5 మార్కులు)

  • ఉపవాచకం 'రామాయణం' నుండి 'పేరా' ఇవ్వాలి.
  • దీని ఆధారంగా అవగాహన ప్రశ్నలు '5' ఇవ్వాలి. ఒక్కొక్క ప్రశ్నకు '' ఒక మార్కు. మొత్తం మార్కులు 5.

2. పరిచిత పద్యం - 10 మార్కులు

  • సూచించిన పాఠ్యంశాలలోని (పద్యభాగం) చుక్క లను ఇవ్వాలి.
  • మూడు ప్రశ్నలు ఇస్తే ఒక ప్రశ్నకు జవాబు రాయాలి.
  • పద్యాన్ని పూరించి దాని భావం రాయడం రెండు ప్రశ్న ఇవ్వాలి.
  • పద్యానికి ప్రతిపదార్ధం రాయడం ఒక ప్రశ్న ఇవ్వాలి.
  • ఇలా మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వాలి.

3. అపరిచిత గద్యం - 5 మార్కులు (5X1=5 మార్కులు)

  • అపరిచిత గద్యం 6 నుండి 8 వాక్యాల పేరాను గద్యంగా ఇవ్వాలి.
  • దీని ఆధారంగా 5 అవగాహన ప్రశ్నలు ఇవ్వాలి.
  • ఒక్కొక్క దానికి '1' మర్కు చొప్పున ఉంటాయి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత - 40 మార్కులు


1. స్వీయరచన - 33 మార్కులు


అ) లఘు సమాధాన ప్రశ్నలను కూడా సూచించిన పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి. 3X4=12 మార్కులు

  • మొత్తం '6' ప్రశ్నలు ఇవ్వాలి. వీటిలో '3' ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు '4' మార్కుల చొప్పున ఉంటాయి. 12 మార్కులు
  • 2 ప్రశ్నలు కవి / రచయిత పరిచయం ప్రశ్నలు అనగా ఒక ప్రశ్న పద్యభాగం పాఠాలు, 2వ ప్రశ్న గద్యభాగం పాఠాల నుండి ఇవ్వాలి.
  • మిగిలిన నాలుగు ప్రశ్నలలో '2' ప్రశ్నలు పద్య భాగం పాఠాలు, మిగిలిన '2' ప్రశ్నలు గద్యభాగం పాఠాల నుండి ఇవ్వాలి.

ఆ) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు - 3X7=21 మార్కులు

  • వ్యాసరూప సమాధాన ప్రశ్నలను కూడా సూచించిన పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి.
  • వ్యాసరూప సమాధాన ప్రశ్నల కోసం గద్యభాగం, పద్యభాగం, ఉపవాచకం రామాయణం నుండి రెండేసి ప్రశ్నల చొప్పున ఆరు ప్రశ్నలను కలిపి ఇవ్వాలి.
  • 6 ప్రశ్నలను ఉన్నాయి 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి.
  • ఒక్కొక్క ప్రశ్నకు 7 మార్కుల చొప్పున మొత్తం 3 ప్రశ్నలకు 21 మార్కులు.

2. సృజనాత్మకత - 7 మార్కులు  (1×7=7 మార్కులు)

  • సూచించిన పాఠ్యాంశాలలోని పాఠాలలో పరిచితమైన సృజనాత్మక ప్రశ్నల ఆధారంగా ఇవ్వాలి.
  • 3 ప్రశ్నలు ఇస్తే ఒక ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉంటుంది.
  • దీనికి '7' మార్కులు ఉంటాయి.

III. భాషాంశాలు - 20 మార్కులు


1. పదజాలాంశాలు - 10 మార్కులు (10X1= 10 మార్కులు)

  • సూచించిన పాఠ్యాంశాలలోని విషయాల ఆధారంగా ఇవ్వాలి.
  • ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 10 మార్కులు ఉంటాయి.
  • వీటిలో '2' ప్రశ్నలు సొంతవాక్యాలు రాయడానికి ఇవ్వాలి. మిగిలిన '8' ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వాలి.
  • అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, పదవివరణలు, జాతీయాలు మొదలగు వాటిని ప్రశ్నించాలి.

2. వ్యాకరణాంశాలు - 10 మార్కులు (10X1= 10 మార్కులు)

  • పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలు అనగా 12 పాఠాలలోని వ్యాకరణాంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10 మార్కులు ఉంటాయి.
  • సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాల రకాల నుండి ప్రశ్నలు ఇవ్వాలి.


0/Post a Comment/Comments