అమర ఫలం.(చిట్టి కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అమర ఫలం.(చిట్టి కథ). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

అమర ఫలం (చిట్టి కథ)
---------&&&&--------------
చెన్న పట్టణమందు ఓ భవంతిలో తండ్రి కొడుకు రంగుతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి కొడుకుతో"రంగూ ! నాయనా! ఈ డబ్బులు తీసుకుని బజారుకెళ్ళి పండ్లు తీసుకునిరా"అని ఆదేశించాడు. తండ్రి చెప్పిన ప్రకారంగా రంగు డబ్బులు తీసుకుని బజారుకు వెళ్ళాడు. మార్గంలో ఒక వ్యక్తి మూలుగుతూ ఉండడం అతడు గమనించి, ఆ వ్యక్తితో"బాబాయ్! ఎందుకు మూలుగుతున్నావు. ఏమైంది?"అని అడుగగా, ఆ వ్యక్తి  అన్నాడు."బాబూ! ఆకలి బాధ చే నేను చచ్చి పోతున్నాను. అనగా వెంటనే రంగు నాన్నగారు ఇచ్చిన డబ్బుతో కొన్ని పండ్లు, భోజనం తెచ్చి అతనికి తినిపించాడు.
తాను తిరిగి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతని చేతులు ఖాళీగా ఉన్నాయి. పండ్లు లేని ఖాళీ చేతులను చూసి తండ్రి"రంగు బేటా! పండ్లు తెచ్చావా?
నాన్నగారు! పండ్లు అయితే తెచ్చాను. అనగా ఎక్కడ ఉన్నాయి అవి? అవి కనిపించని పళ్ళు.
కనిపించవా, అవేమి పండ్లు? ఎలాంటివి? అని  తండ్రి అడగగా,
ఇక దాచుకోక ఉన్న సంగతి పూర్తిగా తండ్రికి చెప్పాడు రంగు. ఒక నిరుపేద ఆకలితో ఉన్నాడు. అతడిని ఎవరు చూడడం లేదు. నేను చూసి వెంటనే మీరిచ్చిన డబ్బుతో భోజనం కొనుక్కొచ్చి అతనికి తినిపించాను నాన్న. అతని లోని ఆత్మారాముడు సంతోషించి నన్ను దీవించాడు. ఆ దీవెన అమర ఫలాల్ని తెచ్చాను అని అనగా"తండ్రి రంగును తన హృదయానికి హత్తుకొన్నాడు.
  పుత్త్ర్ తుమ్హారా జగత్ మే సదా రహేగా నామ్!
లోగోంకే తుమ్ సే సదా, పురణ్ హోంగే కామ్!!
          తండ్రి ఇదే విధమైన ఆశీర్వాదాన్ని ఇస్తూ అన్నాడు."నాకన్నా! నిజంగా నువ్వు  అమర ఫలాన్ని తెచ్చావు. నీ ఈ దివ్య లక్షణం ఒక రోజున నిన్ను తప్పకుండా మహాత్ముడిని చేసేస్తుంది. అలా దీవించబడిన రంగు పేరు గల బాలుడు ఎవరో కాదు, దక్షిణ భారతదేశమందు గొప్ప సంతు గా పేరు పొందిన సంతు రంగదాసుజీ.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments