గుర్రాల. 9491387977.
గుర్రాల మణిపూసలు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
41) పచ్చని చెట్లను పెంచు
అవి ఫలముల నందించు
గైకొను వాటి రక్షణ
అప్పుడు అవి దీవించు!
42). మందు తాగు అలవాటు
చేయకు ఆ పొరపాటు
చెడి పోగు ఆరోగ్యం
మందుతో కలుగు చేటు
43). కష్టే ఫలియని తెలుసుకో
ఇష్టంతో ఇక మసలుకో
కష్టపడితేనే సుఖం
అని తెలుసుకొని నడుచుకో !
44). కురిసే అకాల వర్షాలు
కలిగిస్తాయిలే నష్టాలు
పంటలు వరదల పాలగు
మిగులు ప్రజలకు కష్టాలు!
45). అన్యాయానికి తలపడకు
న్యాయ ఫథాన్ని విడువకు
న్యాయ విలువల బోధించు
నీ పట్టును ఇక మరువకు !