ధ్యానమార్గం .(సాక్షిత వ్యాసం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యానమార్గం .(సాక్షిత వ్యాసం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యానమార్గం (సంక్షిప్త వ్యాసం)
------------&&&&&-----------------
మనకు ధ్యానమే ప్రధానం అందాం
తెలుసుకొని మనమంతా ఉందాం
ఆచరించి అందరికీ ఇక చూపిద్దాం
స్వయంగా వారందరిచే చేపిద్దాం. !

స్థిరచిత్తంతో చేయాలిలే ధ్యానం
అస్థిరత్వంతో చేయకు పరధ్యానం
యత్నం ప్రయత్నంకైచేయి నిదానం
నిత్యం నువు చేసేదే ఈఅవధానం !

నిష్టతో ప్రతిష్టతో చేయాలి ధ్యానం
ఇష్టం కష్టం కలయికలదే ప్రధానం
సాధనచే జయించేదే ఈ అవధానం
అసాధనల తొలగిస్తే కల్గు నిదానం !

ధ్యాన మార్గం లోనే మనం ఉందాం
ఆసాధనల నుండి కాపాడుకుందాం
నిష్టతోని ధ్యానంచేయుటే ప్రధానం
తెలుసుకొని చేయాలిక  ఆవిధానం!

పై పై నుండి కాదు. నిండు మనసుతో ధ్యానం చేయాలి. ఏ అ సాధనల వల్ల విజ్ఞం కలుగుతుందో కనిపెట్టి కడు జాగ్రత్తలు తీసుకోవాలి. ధ్యాన సమయంలో దృఢ సంకల్పం చేసుకోవాలి. నీ మొత్తం శక్తితో మీ సర్వస్వం అర్పించాలి. ఎవరికి? ఎవరికంటే నీ హృదయములో దాగి ఉన్న ఆత్మ పరమాత్మకు. ఎవరైతే ఉన్న పంచ జ్ఞానేంద్రియాలను. అంతకరణ చతుష్టయం--మనస్సు, బుధ్ధి, చిత్తం, అహంకారం ఈ తొమ్మిదింటిని నడిపే శక్తి ని ఇస్తున్నాడో, ఆ చైతన్య భగవానునికి పూర్తిగా మొత్తం శక్తితో మీ సర్వస్వాన్ని అర్పించేసెయ్యండి. మనం సగం సగం అర్పించేస్తాం. జీవించేది కూడా పూర్తిగా జీవించం. తినడం కూడా పూర్తిగా తినం. నిద్రించడం కూడా పూర్తిగా చెయ్యం. తీసుకునేది కూడా పూర్తిగా తీసుకోం. ఇచ్చేది కూడా పూర్తిగా ఇవ్వం. ఇలా ధ్యానం కూడా  పూర్తిగా చేయం. ధ్యానంలో కూడా మనం ఎంత అవినీతిపరులుగా మారామంటే, భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు కూడా అటూ ఇటూ చూస్తూ ఉంటాము. చూసేవారు ఏమనుకుంటారో అని సంతు ప్రీతం దాస్ ఇలా చెప్తారు.

పరథమ్ పహేలుం మస్తక మూకీ.
బళతీ లేవుం నామ్ జోనే
సుత్ విత్ దారాశీశ్ సమరపే
తేపామే రస్ పీవీ జోనే !

(ఎవరైతే మొట్టమొదట తన అహంకారం అనే మస్త కాన్ని అర్పణ చేస్తారో, తరువాత వారి మార్గంలో నడిచే మాటను మాట్లాడుతారో, ఎవరైతే పుత్రులు, ధనం, భార్య, మరియు తన తలను సమర్పితం చేస్తారో వారు రు భగవత్-రసాన్ని గ్రోల డానికి అర్హులవుతారు.
మనం ధ్యానంలోను, అలాగే సాధనలోను నిజాయితీతో దిగిన ట్లైతే విజయం అలవోకగా లభిస్తుంది.. కానీ మనం పై పై నుండి చేస్తాము. ఇలా చేయడం వల్ల సంపూర్ణ విజయం సాధ్యం కాదు. ధ్యానం పై పూర్తి ప్రాణాలను ఉంచి చేయాలి.
Work while you work, play while you play.
That is the why to be happy and gay.
ఏ సమయములో ఏది చేస్తామో దానిలో మనం పూర్తిగా విలీనమై నట్లయితే విజయం తప్పక లభిస్తుంది. భగవన్నామాన్ని జపిస్తూ జపిస్తూ మనం ధ్యానస్తులం కావాలి. మన హృదయం పరమ పవిత్రం కావాలి. బ్రహ్మజ్ఞాని మహాపురుషుల వచనాలను వినే టందుకు మన హృదయంలో దాహం పుట్టుక రావాలి. తృప్తి తీరక దాహం తీర్చుకోవాలి. అప్పుడే మన హృదయానికి పరిపూర్ణమైన ఆ భగవంతుని రసానుభూతి అందుతుంది. ఆపై మన జీవనం ఆనంద అలలపై తేలి ఆడుతుంది. అలా  నిత్యం ధ్యాన దాహం తీర్చుకోవాలి. తీర్చుకొని జీవితాన్ని ఆరోగ్య ప్రదంగా మార్చుకోవాలి.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ ర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments