ఆరాధ్య దైవం అమ్మ. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

ఆరాధ్య దైవం అమ్మ. (బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

ఆరాధ్య దైవం అమ్మ (కవిత)
----------&&&&&&---------------
అమ్మ అనే పదం
ఎంత కమ్మదనం
అమ్మే సర్వస్వం
ఆమ్మే ఐశ్వర్యం !

అమ్మ పోస్తుందిలే
నిత్యం నీకు లాల
ఏడవకు ఓ బాల
ఆపుకోవాలి గోల !

అమ్మే ఆరాధ్యదైవం
తెలుసుకో నీవు వైనం
వెంటనే తొలగు ధైన్యం
ఆమె వెంటే నీ సైన్యం !

అమ్మ ఇస్తుందిలే ముద్దు
క్రమం తప్పక ప్రతి పొద్దు
నీమదిలోని చింత రద్దు
నీకు హాయి కల్గుట కద్దు!

అమ్మేగా మనందరి  ప్రాణం
మనకు ఉండదు నిస్త్రాణం
తొలిగించునులే  ఆనారోగ్యం
కలిగించునులే ఇక ఆరోగ్యం !

మా అమ్మే మాకు  సమస్తం 
ఆమెకోసం ప్రాణమైన ఇస్తాం
మేం అన్నమాటను చెల్లిస్తాం
మా అమ్మ పాటను ఒల్లవేస్తాం!

బడికి తా నిత్యం పంపిస్తుంది
చదువుల సారం ఓంపేస్తుంది
అక్షర కుక్షియని అనిపిస్తుంది
అక్షరాస్యులకు వినిపిస్తుంది!

అందుకే ఆరాధిద్దాం ఆ అమ్మను
ముందేవెలిగిద్దాం దీపం సెమ్మెను
పూజిద్దాం ఆ ముద్దుల కొమ్మను
ప్రేమిద్దాం ఈ సద్దుల జేజమ్మను !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments