హే భగవాన్. (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

హే భగవాన్. (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ఉన్నతుడే మన  భగవంతుడు
మహోన్నతుడైన భాగ్యవంతుడు
ఆయనను వేడుకుందాం భక్తితో
స్వయాన కోరుకుందాం ముక్తితో !

మానవుడు మహనీయుడు
అలా తీర్చిదిద్దేనుగా దేవుడు
ఆ దేవుణ్ణి నమ్మి పూజిస్తాడు
ఈమానవుడు జినుడై వస్తాడు !

అందరూ ఆయన బిడ్డలే
ప్రాంతాలన్ని ఆయన అడ్డలే
పాలించి మనల కరుణిస్తాడు 
లాలించి వరాన్ని అందిస్తాడు !

అనిశము వెన్నంటి ఉంటాడు
స్నేహితునిగా ఆదుకుంటాడు
అమ్మలా మనల లాలిస్తాడు
నిమ్మకు నీరెత్తక పాలిస్తాడు !

దేవుడు మెచ్చి ఇచ్చే ఆశ్రయం
అందించే ఆయన సహాయం
బతుకులో కలిగించు ఉదయం
చితుకుల తొలగించు మహోదయం

 భగవంతునికి ఇలలో లేరు సాటి
అతనికి అతడే పోటి అయిన మేటి
మనోవాంఛను తీర్చేటి ఘనాపాటి
గాయంమాన్పేటిమాయల మరాటి

భగవంతుని చరణాలకు మొక్కు
వెంటనే చెల్లించు ఆపదల మొక్కు
శని తొలగేలా శరణు వేడుకొనుము
దీవించే దీవెనలను అందుకొనుము

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments