పసిపిల్లలు. (బాలల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

పసిపిల్లలు. (బాలల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

[13/05, 6:35 pm] Laxmareddy: పసిపిల్లలు (బాల గేయం)
----------&&&&&&------------
పసిపిల్లలు మల్లెలు
వసివారని మొల్లలు
హరివిల్లుల తళుకులు
విరి జల్లుల బెళుకులు !

పసివారి మాటలు
ముత్యాల మూటలు
లేరులే వారికి సాటి
ఇలలోన వీరికి పోటీ!

నమ్రత బాల్యం మధురం
అమృతతుల్యం హృదయం
దైవానికి వారేఇల సమానం
లేదులే ఎవ్వరికి అనుమానం!

పసికూనలు సుమములు
మసి పారని కుసుమాలు
మంటిలో పెరిగేమొక్కలు
ఇంటిలో వెలిగే చుక్కలు !

చిలక పలుకుల పిల్లలు
అలుక లెరుగని మల్లెలు
పెరిగిసాగు సెలయేరులు
తరిగిపోవు మలబారులు !

పసిపిల్లల పలుకులు
తేనె తీపి చినుకులు
వారి పాడేటి పాటలు
చేరి సాగేటి బాటలు !
[13/05, 6:36 pm] Laxmareddy: గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments